వామ్మో.. అబ్బాయి కోసం అమ్మాయిల గొడవ.. నా వాడు అంటే నా వాడు అని..
అమ్మాయి కోసం అబ్బాయి గొడవలు సహజమే.. కొన్ని చోట్ల హతమార్చడం కూడా జరుగుతుంది. అయితే ఓ అబ్బాయి కోసం అమ్మాయిలు డిష్యూం డిష్యూం చేశారు. అవును మీరు చదువుతుంది నిజమే. ఈ ఘటన విశాఖపట్టణం అనకాపల్లిలో జరిగింది.ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా సిగపట్లు పట్టారు. దీంతో చుట్టూ ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అమ్మాయిలతో పాటు ప్రియుడ్ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

యువకుడిని ప్రేమించిన ఇద్దరు
విశాఖ నగరంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఓ యువకుడిని ప్రేమించారు. సదరు యువకుడు వేరే యువతితో మాట్లాడుతున్న సమయంలో బాలిక చూసి వారిద్దరినీ నిలదీసింది. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని.. యువకుడు నిన్ను ప్రేమించడం లేదంటూ అమ్మాయి చెప్పడంతో ఇద్దరు బాలికల మధ్య వాగ్వాదం నెలకొంది. అదీ తీవ్రస్థాయికి చేరింది.

బూతుపురాణం
నగరం నడిబొడ్డున కాలేజీ వేదికగా ఈ ఘటన జరిగింది. రోడ్డుపైకి వచ్చిన ఇద్దరు బాలికలు... ఒక యువకుడి కోసం కొట్టుకున్నారు. తొలుత వాగ్వాదానికి దిగి, ఆ తర్వాత బూతు పురాణంతో ఒకరికొకరు సిగ పట్లు పట్టుకున్నారు. ఈ వ్యవహారం శృతి మించడం, విద్యార్థులు అంతా అక్కడ గుమికూడంతో గమనించిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఒక్కొక్కరికీ సర్ది చెప్పారు.

మైనర్లు
బాలికలు ఇద్దరూ మైనర్లు కావడంతో ఆ యువకుడిని కూడా పిలిపించి ముగ్గురికీ కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పోలీసులు పంపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. 'వాడు నావాడే.. కాదు నావాడే' అనుకుంటూ ఇద్దరూ తిట్టుకుంటున్నారు. వారిద్దరూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికల తల్లిదండ్రులను పిలిపించి మరీ విషయం తెలియజేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications