విశాఖలో దారుణం: నేవీ అధికారి కుమార్తెపై అటెండర్ లైంగిక దాడి, వీడియో తీసి, మరికొందరు

విశాఖపట్నం: విశాఖలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్ అటెండర్ అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక, ఆమెను నగ్నంగా వీడియోలు తీసి తన స్నేహితులకు పంపించాడు. దీంతో ఆ వీడియోలను చూసిన నిందితుడి మిత్రులు కూడా ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు.

చివరకు బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడైన అటెండర్‌ను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విశాఖపటట్నంలోని 104 ఏరియాకు చెందిన నిందితుడు సత్యరావు ఓ స్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.

Visakhapatnam: A navy officers daughter sexually assaulted, one arrested.

బాధిత బాలిక ఉండే అపార్ట్‌మెంట్‌లోనే అతడు కూడా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను వివస్త్రను చేసి మొబైల్‌లో వీడియో తీసి. వాటిని తన మిత్రులకు పంపాడు. వారు కూడా బాలికను బెదిరించి జూన్ 3 నుంచి 23వ తేదీ వరకు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేశారు.

ఈ క్రమంలో బాలిక ప్రవర్తనలో మార్పులు రావడంతో గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో జరిగిన దారుణాన్ని బాలిక తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీసులు నిందితుడు సత్యరావును అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

బాధిత బాలికకు విశాఖ కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసును దిశ పోలీసు విభాగానికి బదిలీ చేసి విచారణ వేగవంతం చేశారు. ఏసీపీ వివేకానంద కేసు దర్యాప్తు చేస్తున్నారు. సత్యారావు పనిచేసే స్కూల్‌లోనే బాలిక చదువుతుండటం, తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే బాధిత బాలిక ఉండటంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టేందుకు అవకాశం చిక్కిందని విచారణలో పోలీసులు తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+