Pushpa Srivani: వీడియో: థింసా నృత్యం అదుర్స్: డప్పు కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

విజయనగరం: ప్రపంచ ఆదివాసిీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విజయనగరం జిల్లా పార్వతిపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు అధికారులు. విజయనగరం జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి.. స్వయంగా ఈ శాఖను పర్యవేక్షిస్తోన్నందున పార్వతిపురంలో నిర్వహించిన ఆదివాసి దినోత్సవ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది.

పార్వతిపురంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఆదివాసి ఉత్సవాలకు పుష్ప శ్రీవాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు అలజంగి జోగారావు,కలెక్టర్ సూర్యకుమారి, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో గిరిజన మహిళలతో కలిసి పుష్ప శ్రీవాణి కూడా నృత్యం చేశారు. గిరిజన మహిళలతో కలిసి పుష్ప శ్రీవాణి డప్పుల శబ్దానికి అనుగుణంగా థింసా నృత్యం చేఃశారు. కలెక్టర్ సూర్యకుమారి కూడా వారితో పాదం కలిపారు. పార్వతిపురం శాసనసభ్యుడు అలజంగి జోగారావు డప్పు కొట్టారు.

మరోవంక- ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పోలవరం, బాక్సైట్ తవ్వకాల అంశాలను ఆయన ప్రస్తావిస్తూ అధికార పార్టీపై పలు ఆరోపణాస్త్రాలను సంధించారు. రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామంది ఆదివాసీలు ఉన్నారని, వారిని వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు.

ఇళ్లను ఖాళీ చేయించే విషయంలో ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ నిలువ నీడలేకుండా చేస్తోందని ఆరోపించారు. అటు విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాలను ప్రోత్సహిస్తోందని వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. గిరిజనుల భవితవ్యాన్ని కాలరాస్తోందంటూ మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో గిరిజన సంఘాలు ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను పట్టించుకోవట్లేదని విమర్శించారు.

AP Deputy CM Pushpa Srivani participate in World tribal day celebrations

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్దన్నా వైసీపీ మైనింగ్ మాఫియా చేస్తోన్న దోపిడీ ఆగట్లేదని అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ ఒక్క పథకం కూడా ఇప్పుడు అమలులో లేదని చంద్రబాబు అన్నారు. గిరిజన రిజర్వేషన్ల జీవో-3 రద్దు పై ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించట్లేదని చెప్పారు. ఇప్పటికైనా విశాఖపట్నం మన్యంలో మైనింగ్ అక్రమాలను నిలిపివేయడానికి, స్తంభించిపోయిన గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+