ఆ గురువు కోసం కదిలొచ్చిన గ్రామం .. కాళ్ళు కడిగి, పూజలు చేసి భుజాలపై ఊరేగించి ఘనంగా వీడ్కోలు సంబరం
తల్లి ,తండ్రి, గురువు దైవం తో సమానం అంటారు. అలాంటి దైవ సమానమైన గురువును గుండెల్లో పదిలంగా పెట్టుకుంది ఓ గ్రామం. పదేళ్ల పాటు ఓ మారుమూల కుగ్రామంలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆ గురువును భుజాలపైకి ఎక్కించుకొని ఊరంతా తిప్పి పండుగ చేశారు ఆ గ్రామస్తులు. ఇంతకీ ఆ గురువు చేసింది ఏంటి? గురువుని ఇంతగా గౌరవించిన ఆ గ్రామం ఎక్కడ ఉంది? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

మారుమూల కుగ్రామంలో10 ఏళ్లపాటు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయుడు
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మల్లుగూడ ఒక గిరిజన గ్రామం. ఈ గ్రామంలో 2011 నుండి ప్రభుత్వ పాఠశాలలో గౌడు నరేంద్ర అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. గ్రామంలోని పాఠశాల శిధిలావస్థకు చేరుకున్నా , పాఠశాలకు సరైన భవనం లేకపోయినా చెట్ల నీడలో, శిధిలమైన షెడ్డులోనే విద్యా బోధన చేశారు. మల్లు గూడా గిరిజన గ్రామ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. పదేళ్లలో ఏనాడు విద్యార్థులకు విద్యను బోధించడం పట్ల ఆ ఉపాధ్యాయుడు అలసత్వం ప్రదర్శించలేదు.

వేరే స్కూల్ కు బదిలీ అయిన టీచర్ కు ఘనంగా మరచిపోలేని వీడ్కోలు
తాజాగా ఉపాధ్యాయుడు నరేంద్ర వేరే ప్రాంతానికి సంబంధించిన స్కూల్ కు బదిలీ అయ్యారు. దీంతో గ్రామస్తులంతా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. సంబరాలు జరిపారు. కాళ్లు కడిగి పూజలు చేశారు. ఊరంతా కలిసికట్టుగా వచ్చి ఆయనను భుజాలపై ఎక్కించుకొని ఊరేగించారు. డప్పు చప్పుళ్ళతో , గిరిజన నృత్యాలతో భుజాలపై ఎత్తుకుని ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నరేంద్ర దంపతులకు ఘనంగా సన్మానం చేశారు. ఇక గురువును అత్యంత ఘనంగా గౌరవించి సాగనంపిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గొప్ప గురువు .. గొప్ప మనసున్న గ్రామస్తులు ..
గురుతరమైన బాధ్యతను మరిచిపోతున్న గురువులు ఉన్న నేటి రోజుల్లో, గురువులంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులు ఉన్న తరుణంలో ఈ వీడియో అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది . మారుమూల గ్రామమైనా నిత్యం వెళ్లి అక్కడ పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పించటం ఆ గురువు నిర్వహించిన పాత్ర, అలాంటి గురువును గుండెలకు హత్తుకున్న ఆ గ్రామ ప్రజల, విద్యార్థుల ప్రేమ నిజంగా నిరుపమానం. ఇలాంటి గురువుల కాళ్లు కడిగి, పూజలు చేసినా ,భుజాలపై ఎత్తుకుని ఊరేగించినా, ఎంత చేసినా తక్కువే.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications