బీఆర్ఎస్ లోకి ఎమ్మెల్సీ అభ్యర్ధి - కొత్త సమీకరణం..!!

ఏపీలో విస్తరణ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఏపీకి చెందిన మరి కొందరు బీఆర్ఎస్ లో చేరారు.

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో విస్తరణ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఏపీకి చెందిన మరి కొందరు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కొందరు సీనియర్ నేతలతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. మార్చి నెలాఖరులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో పర్యటన ఉంటుందని తెలుస్తోంది. విశాఖలో బహిరంగ సభ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి.. మరి కొందరు బీఆర్ఎస్ లో చేరారు.

ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరికలు పెరుగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో జనసేనలో పని చేసిన నేతలు.. టీడీపీ మాజీ మంత్రి..రిటైర్ఢ్ సివిల్స్ అధికారులు ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తరువాత కొత్తగా చెప్పుకోదగిన స్థాయిలో చేరికలు లేవు. గోదావరి జిల్లాలకు చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తాజాగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలో ఉన్న విజయనగరం జిల్లా ఎస్ కోటకె చెందిన చిప్పాడ శేషగిరి రావు గులాబీ కండువా కప్పుకున్నారు. విశాఖకు చెందిన సినీ గేయ రచయిత పెండ్యాల రవీంద్ర, విక్రమ్‌కుమార్‌, సంగీత దర్శకుడు మహేశ్‌ధీర, అనిల్‌సింగ్‌ కూడా గులాబీ పార్టీలో చేరారు.

North Coastal contesting MLC Candidate, some more leaders joins in BRS,

ఏపీలో పార్టీ విస్తరణ దిశగా త్వరలో కీలక నిర్ణయాలు ఉంటాయని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఏపీలో ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుందనే చర్చపైన ఆ పార్టీ ముఖ్య నేత కవిత క్లారిటీ ఇచ్చారు. తాము ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోరాటం చేస్తామని..ఎవరికీ అనుకూలం కాదు..వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. యూపీ అయినా..ఏపీ అయినా తాము గెలిచేందుకే పోటీ చేస్తామని స్పష్టం చేసారు. ఏపీలో వైసీపీకి అనుకూలంగా బీఆర్ఎస్ నిర్ణయాలు ఉంటాయనే ప్రచారాన్ని ఖండించారు. ఇక.. ఏపీలో మూడు రాజధానుల విషయం పైనా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. అమరావతికి మద్దతుగా తమ పార్టీ నిలుస్తుందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఏపీ పర్యటన వేళ విధాన పరమైన నిర్ణయాల పైన స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+