వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ పునర్విభజన దిశగా వరంగల్.. కొత్త జిల్లాలకు సీఎం గ్రీన్ సిగ్నల్..! మొత్తం ఎన్నంటే..!

|
Google Oneindia TeluguNews

వరంగల్ : ఓరుగల్లు జిల్లా మరోసారి పునర్విభజనకు నోచుకోనుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఇప్పటికే ఆరు జిల్లాలుగా విభజించారు. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలతో పాటు జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహాబూబాదాద్‌ జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మరో రెండు జిల్లాలు కావాలంటూ సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు ప్రజల నుంచి డిమాండ్ రావడం.. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

వరంగల్ జిల్లాను మరోసారి పునర్ వ్యవస్థీకరించాలన్న సీఎం నిర్ణయంతో ఓరుగల్లు రూపురేఖలు మళ్లీ మారనున్నాయి. పరిపాలనా సౌలభ్యం పేరిట ఇప్పటికే రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించారు. ఇక వరంగల్ జిల్లాను మరోసారి విభజించి కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తే ఆ సంఖ్య 35కు చేరనుంది.

అప్పుల కుప్ప తెలంగాణ.. వడ్డీయే 11 వేల కోట్లు!.. కేంద్రం బయట పెట్టిన నిప్పులాంటి నిజాలు..!అప్పుల కుప్ప తెలంగాణ.. వడ్డీయే 11 వేల కోట్లు!.. కేంద్రం బయట పెట్టిన నిప్పులాంటి నిజాలు..!

వరంగల్ మళ్లీ పునర్విభజన.. కొత్తగా మరో రెండు జిల్లాలు

వరంగల్ మళ్లీ పునర్విభజన.. కొత్తగా మరో రెండు జిల్లాలు

వరంగల్ జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. ఇప్పటికే ఆరు జిల్లాలుగా విభజించిన ఓరుగల్లును మరోసారి పునర్ వ్యవస్థీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజల డిమాండ్ మేరకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో మరో రెండు జిల్లాల ఏర్పాటుకు ఆమోద ముద్ర లభించినట్లైంది. వరంగల్‌ తూర్పు, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రజలు తమకు వరంగల్‌ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు.

పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016, అక్టోబర్‌ 11న జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టింది. ఆ క్రమంలో ఉమ్మడి పది జిల్లాలకు మరో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దాంతో మొత్తం జిల్లాల సంఖ్య 10 నుంచి 31కు పెరిగింది. అయితే ప్రజల నుంచి వీపరీతమైన డిమాండ్ వచ్చిన కారణంగా.. రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది.

 ప్రజలు, లీడర్ల నుంచి డిమాండ్.. సీఎం గ్రీన్ సిగ్నల్

ప్రజలు, లీడర్ల నుంచి డిమాండ్.. సీఎం గ్రీన్ సిగ్నల్


ప్రధానంగా వరంగల్ జిల్లాను మరో రెండు జిల్లాలుగా విభజించడానికి అనేక కారణాలున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా వరంగల్ నగరంతో అనుబంధముంది. అదేవిధంగా వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు వైద్యం ఇతరత్రా అవసరాల కోసం వారు వరంగల్ నగరానికే రావాల్సి ఉంది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎంజీఎం ఆసుపత్రి, కేఎంసీ, ఎనుమాముల మార్కెట్ వరంగల్‌ పరిధిలోనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని కూడా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కలిపి వరంగల్‌ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక 8 జిల్లాలుగా వరంగల్ విభజన.. త్వరలోనే ఉత్తర్వులు..!

ఇక 8 జిల్లాలుగా వరంగల్ విభజన.. త్వరలోనే ఉత్తర్వులు..!

వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌ మాదిరిగానే హన్మకొండకు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఆ క్రమంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ రాజధానిగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ముఖ్యమంత్రికి వినతి పత్రాలు వెళ్లాయి. దాంతో ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

వరంగల్‌ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వరంగల్‌ పేరును, హన్మకొండ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు హన్మకొండ పేరును పెట్టాలని కోరారు. దాంతో వరంగల్, హన్మకొండ నగరాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను కొనసాగించినట్లు అవుతుందని భావించి సీఎం కేసీఆర్‌ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

English summary
Telangana Chief Minister KCR green signal for warangal district bifurcation again with two more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X