వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనగామలో నీటి గల గల.. ఒకప్పుడు నీటి ఎద్దడి: సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

అద్భుతమైన సౌకర్యాలతో జనగామలో కలెక్టరేట్ నిర్మించుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. జనగామ ఒకప్పుడు ఎండిపోయి మోడుబారిపోయి కనిపించేదని ఇప్పుడు కళకళలాడుతోందని తెలిపారు. జనగామ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పరచుకుని.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జనగామ రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జీవించి ఉన్న సమయంలో జనగామను తలచుకుని ఎంతో బాధపడేవారని గుర్తు చేసుకున్నారు.

 అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..


ఏడేళ్ల క్రితం జనగామ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మనందరికి తెలుసు అని చెప్పారు. ఒకప్పుడు నీళ్ల కోసం మహిళలు మైళ్ల కొద్దీ దూరం నడిచివెళ్లేవారిని చెప్పారు. ఇప్పుడు ఇంటికే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు జనగామలో కరవు పరిస్థితులు ఉండేవని.. ఆనాటి కరవు పరిస్థితులను చూసి బచ్చన్నపేటలో ఏడ్చాశానని.. రాష్ట్రం ఏర్పడ్డాక, చక్కటి ప్రణాళికలు వేసుకుని పరిస్థితులను మార్చుకున్నామని తెలిపారు.

 అధిగమించాం..

అధిగమించాం..

దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసుకుని నీటి సమస్యలను అధిగమించామని తెలిపారు. ఒకప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉన్న పండే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు మూడు ఎకరాల భూమి ఉన్న రైతు కోటీశ్వరుడు అని అన్నారు. దేశంలో అవార్డులు పొందిన గ్రామాల్లో 10 గ్రామాలు తెలంగాణలోవేనని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రానికి గానీ వరంగల్ జిల్లాకు గానీ కరవు పరిస్థితి అనేదే లేదని అన్నారు. కరెంట్ పోయింది అనేమాటే లేదన్నారు. 2601 రైతు వేదికలు కట్టించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు.

 జిల్లాల పర్యటన

జిల్లాల పర్యటన

జనగామ పర్యటన తర్వాత నిజామాబాద్‌, హనుమకొండ, జగిత్యాల, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్‌ తదితర జిల్లాలకు వెళ్లనున్నారు. గతంలో కేసీఆర్ ఆయా జిల్లాల్లో పర్యటించాలని అనుకున్నారు. అనివార్య కారణాలతో ఆ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. జిల్లా పర్యటనల సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల భవన సముదాయాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో వరంగల్‌, హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలను నిర్మించగా అవన్నీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల 33 జిల్లాలకు పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. కార్యాలయాలను ప్రారంభించి, వాటిలోనే జిల్లా అధ్యక్షులకు బాధ్యతలను అప్పగించనున్నారు.

English summary
telangana cm kcr Inauguration jangaon collectorate building
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X