క్రికెట్ విషయంలో గొడవ, కర్రతో దాడికి తెగబడ్డ విద్యార్థి, ముగ్గురికి గాయాలు.. (వీడియో)
విద్యార్థుల మధ్య మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేటలో విద్యార్థులకు క్రికెట్ విషయంలో గొడవకు జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ విద్యార్థి.. మరో ఇద్దరిని కర్రతో కొడుతున్న వీడియో స్పష్టంగా కనిపించింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో గొడవ జరిగిందని.. అయితే గొడవకు గల కారణం తెలియలేదు.
అసలే లాక్ డౌన్.. కాజిపేట హై స్కూల్‌లో విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ.. విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఇంతలో ఓ విద్యార్థి కర్ర తీసుకొని బయటకొచ్చారు. మరో ఇద్దరిని కర్రతో దాడి చేయడంతో వారిద్దరూ పడిపోయారు. మరొకరు కూడా గాయపడ్డారు. ముగ్గురిని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల మధ్య గొడవపై విచారణ జరుపుతున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్‌లో ఉంది.. ఇక్కడ బయటకు తిరిగేందుకు కూడా అనుమతి లేదు. కానీ విద్యార్థులు క్రికెట్ ఆడటమే కాదు.. గొడవకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఇంటి పట్టునే ఉండాల్సిన.. విద్యార్థులు... బయట తిరగడమే కాకుండా.. గొడవపడటం ఆందోళన కలిగిస్తోంది.
క్రికెట్ విషయంలో గొడవ, కర్రతో దాడికి తెగబడ్డ విద్యార్థి, ముగ్గురికి గాయాలు.. (వీడియో)#warangalurban #kazipeta #school pic.twitter.com/j8Ad330YYx
— oneindiatelugu (@oneindiatelugu) May 8, 2020












Click it and Unblock the Notifications