మహిళ నడుము పట్టుకున్న డాక్టర్ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు .. ప్లాన్ చేసింది ఆత్మీయుడే
వరంగల్ లో డాక్టర్ క మహిళా నడుము పట్టుకున్నారన్న వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వరంగల్‌లో డాక్టర్ల మధ్య ఆధిపత్యపోరు మహిళకు సుపారీ ఇచ్చి ఓ డాక్టర్ ను టార్గెట్ చేసేలా చేసింది. వరంగల్‌లో బాలాజీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధీర్‌కు, బ్యాంకు కాలనీలో ఉంటున్న మరో డాక్టర్ నాగేశ్వరరావుకు మధ్య ఆధిపత్యపోరు నేపధ్యంలో నాగేశ్వర్ రావు, డాక్టర్ సుధీర్ ప్రతిష్ట , ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బ తియ్యటానికి ఇంత వ్యవహారం నడిపారని తెలుస్తుంది.

వరంగల్ లో డాక్టర్ పై కుట్ర చేసింది మరో డాక్టర్ .. స్నేహితుడే అయినా సుపారీ ఇచ్చి మహిళను పంపి కుట్ర
ఒక కిలాడీ లేడీ ని వైద్యం కోసం ఆస్పత్రికి పంపించి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని డ్రామా చేసి అతనిపై కేసులు అయ్యేలా చూడాలని నాగేశ్వర్ రావు అనే స్నేహితుడే , తనతోపాటు చదువుకున్న వైద్యుడే కుట్ర చెయ్యటం స్థానికంగా ఉన్న డాక్టర్లలో కలకలం రేపింది. డాక్టర్ సుధీర్‌ను అల్లరి చేసి బాలాజీ ఆస్పత్రి పరువు తీయాలని నిర్ణయించుకున్న డాక్టర్ నాగేశ్వరరావు ఇందుకోసం హన్మకొండకు చెందిన రాంబాబు, వెంకటేశ్వరరావుల సాయం తీసుకున్నాడు. డాక్టర్ సుధీర్ పరువు తియ్యాలని కేసు నమోదు అయ్యేలా చూడాలని ఐదు లక్షలకు డీల్ చేసుకున్నాడు.

డాక్టర్ నాగేశ్వర్ రావు ప్లాన్ ప్రకారమే హంగామా చేసిన మహిళ .. నడుము పట్టుకున్నారని నానా రచ్చ
డాక్టర్ సుధీర్‌పై సాధారణ కేసు నమోదు అయ్యేలా చేస్తే లక్షన్నర, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యేలా చేస్తే ఐదు లక్షలు ఇస్తానని రాంబాబు, వెంకటేశ్వరరావుతో నాగేశ్వరరావు ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం సంధ్య అనే మహిళను వెంటపెట్టుకుని రాంబాబు, వెంకటేశ్వరరావులు బాలాజీ ఆస్పత్రికి వెళ్లారు.సాధారణ పేషెంట్ తరహాలో మహిళకు టోకెన్ తీసుకున్నారు. ఎముకల డాక్టర్ అయిన సుధీర్ వద్దకు వెళ్లిన సంధ్య తనకు పక్కటెముకల్లో నొప్పి ఉందని చెప్పింది. దాంతో నొప్పి భాగాన్ని పరిశీలించేందుకు డాక్టర్ ప్రయత్నించారు. అంతే ఒక్కసారిగా డాక్టర్‌పై విరుచుకుపడింది. తనను తాకకూడని చోట డాక్టర్ తాకారని, అసభ్యకరంగా ప్రవర్తించారని గొడవ చేసింది.

డాక్టర్ సుధీర్ పై కేసు పెట్టిన మహిళ... మహిళ గుట్టు రట్టు చేసిన సీసీ టీవీ ఫుటేజ్
పథకం ప్రకారం ఇంతలో బయట ఉన్న రాంబాబు, వెంకటేశ్వరరావు వచ్చి గట్టిగట్టిగా కేకలు వేస్తూ హంగామా సృష్టించారు. సంధ్యను డాక్టర్ పరీక్షిస్తున్న సమయంలో అక్కడ ఇతర మహిళా పేషెంట్లు కూడా ఉన్నారు.ఇక నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆ కిలాడీ లేడీ డాక్టర్ సుధీర్‌పై కేసు పెట్టింది. తాను అసభ్యకరంగా ప్రవర్తించలేదని,కావాలంటే సీసీ ఫుటేజ్‌ను పరిశీలించాలని డాక్టర్ కూడా పోలీసులను కోరారు. తనను కావాలనే అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ డాక్టర్ కూడా ఎదురు కేసు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు.

పరారీలో డాక్టర్ ... ఆధిపత్య పోరే కుట్ర కు కారణం
సంధ్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను గట్టిగా విచారించగా.. అసలు విషయం చెప్పేసింది. డాక్టర్ నాగేశ్వరరావుతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే డాక్టర్ సుధీర్‌ను అల్లరి చేసి ఆస్పత్రి పరువు తీసేందుకు ఇదంతా చేశానని అంగీకరించింది సంధ్య. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి ఐదు లక్షలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేసినట్టు అంగీకరించింది. పోలీసులు రాంబాబు, వెంకటేశ్వరరావు, సంధ్యలను అరెస్ట్ చేశారు. కుట్రకు సూత్రధారి అయిన డాక్టర్ నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు. ఇక వీరికి సహకరించిన మరో 10 మందిపై కూడా కేసు నమోదు అయ్యింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications