వింబుల్డన్‌లో పెను సంచనలం- నాలుగున్నర గంటల హోరాహోరీ పోరులో..!!

లండన్: వింబుల్డన్‌లో పెను సంచలనం నమోదైంది. సుమారు నాలుగున్నర గంటలకు పైగా సాగిన హోరాహోరీ పోరులో కొత్త విజేత ఆవిర్భవించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జొకొవిచ్‌ను మట్టికరిపించాడు. తన కేరీర్‌లో తొలిసారిగా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు..సగర్వంగా ముద్దాడాడు.

ఆ కొత్త ఛాంపియన్ పేరు అల్కరజ్. పూర్తి పేరు కార్లొస్ అల్కరజ్ గార్ఫియా. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్న ఈ స్పెయిన్‌ స్టార్ టెన్నిస్ ప్లేయర్.. అల్కరజ్ అదే స్థాయి ఆటను ప్రదర్శించాడు. లండన్‌లో కొద్దిసేపటి కిందటే ముగిసిన వింబుల్డన్ ఫైనల్స్ పోరులో జొకొవిచ్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.

Wimbledon

అయిదు సెట్ల పోరులో ఘన విజయం సాధించాడు. 1-6, 7-6 (6), 6-1, 3-6, 6-4 సెట్ల తేడాతో నొవాక్‌ను ఓడించాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అందుకోవడం అల్కరజ్‌కు ఇదే తొలిసారి. ఈ సంవత్సరం ఇప్పటికే యూఎస్ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా వింబుల్డన్‌నూ సొంతం చేసుకున్నాడు.

ఇదే సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సత్తా చాటాడు గానీ.. అతని పోరాటం సెమీఫైనల్స్ వరకే కొనసాగింది. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌కే పరిమితం అయ్యాడు. ఈ రెండింటి కొరతను వింబుల్డన్ టైటిల్‌తో తీర్చుకున్నట్టయిందతనికి. ఈ గెలుపుతో వింబుల్డన్‌లో తన జైత్రయాత్రను ఆరంభించినట్టయిందతనికి.

Wimbledon

నిజానికి- అల్కరజ్ ఆరంభం ఆశించిన స్థాయిలో లేదు. తొలి సెట్‌లో ఘోరంగా జొకొవిచ్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఆ సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయాడు. ఈ సెట్‌లో జొకొ దూకుడుగా ఆడాడు. హాఫ్ వ్యాలీలతో బెంబేలెత్తించాడు. ఫోర్ హ్యాండ్ షాట్లతో కోర్టు మొత్తం పరుగులెత్తించాడు.

ఆ పరాభవం నుంచి తేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అల్కరజ్‌కు. రెండో సెట్‌లోనే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. జొకొవిచ్‌తో హోరాహోరీగా పోరాడాడు. సమవుజ్జీగా నిలిచాడు. అతనితో పొరపాట్లను సైతం చేయించాడు. రెండో సెట్‌ను 7-6 తేడాతో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లోనూ అదే ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.

Wimbledon

నాలుగో సెట్‌లో ట్రాక్‌లోకి వచ్చాడు జొకొ. తనదైన శైలిలో శక్తిమంతమైన గ్రౌండ్ షాట్లను ఆడాడు. అల్కరజ్ సర్వీస్‌ను వరుసగా బ్రేక్ చేస్తూ వచ్చాడు. ఇద్దరు కొదమసింహాల్లా తలపడ్డారు. జొకొ ఆడిన కొన్ని ఫోర్‌హ్యాండ్ షాట్లకు అల్కరజ్ వద్ద సమాధానమే లేకుండాపోయింది. ఆ సెట్‌ను 6-3తో గెలుచుకున్నాడు నొవాక్. చివరి రెండు గేమ్స్‌లల్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాన్నీ ఇవ్వలేదు.

Wimbledon

దీనితో మ్యాచ్.. అయిదో సెట్‌కు దారి తీసింది. ఈ సెట్‌లో కూడా తన తొలి సర్వీస్‌ను కాపాడుకోగలిగాడు. 1-0 తేడాతో ఆధిపత్యంలోకి వెళ్లాడు. ఆ దశలో అల్కరజ్ అద్భుతంగా పుంజుకొన్నాడు. రెండో సర్వీస్‌ను కాచుకున్నాడు. 1-1తో సమవుజ్జీగా నిలిచాడు. వరుసగా రెండు, మూడు సర్వీసులను నిలుపుకొన్నాడు. 3-1 తేడాతో ఆధిక్యతను పెంచుకోగలిగాడు.

ఆ దశలో జొకొ విజృంభించినప్పటికీ- దాన్ని చివరి వరకు నిలుపుకోలేకపోయాడు. అల్కరజ్ ఆడిన షాట్లను అందుకోలేకపోయాడు. మ్యాచ్ ఫలితాన్ని నిర్ధారించే చివరి సెట్‌ను 6-4 తేడాతో కోల్పోయాడు. దీనితో మ్యాచ్ అల్కరజ్ వశమైంది. ప్రజంటేషన్ సమయంలో జొకొవిచ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+