ఏదైనా అద్భుతం జరక్కపోతుందా..?

లండన్: లండన్‌లోని ఓవల్‌లో జరుగుతున్న ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యత దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు త్వరగా వికెట్లను కోల్పోయినప్పటికీ పరిస్థితి భారత్ చేయి దాటింది. టీమిండియాను కట్టడి చేసిన తరువాత రెండో ఇన్నింగ్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగలు చేసింది. మొత్తంగా 296 పరుగుల ఆధిక్యతలో ఉంది.

ఇంకా రెండు రోజుల ఆట మిగిలివున్న నేపథ్యంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ గెలవకపోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. తొలి ఇన్నింగ్‌లో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయింది. 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అంజిక్య రహానె, శార్దుల్ ఠాకూర్ ఆపద్బాంధవులు అయ్యారు. వారిద్దరూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.

WTC final 2023

రహానె- 89, శార్దుల్ ఠాకూర్- 51 పరుగులు చేశారు. వారిద్దరూ భారీ ఇన్నింగ్ ఆడకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదు. పకడ్బందీ లైనప్‌తో మ్యాచ్‌లో దిగిన ఆస్ట్రేలియా బౌలర్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించారు. పాట్ కమ్మిన్స్-3 వికెట్ల పడగొట్టాడు. మిఛెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. నాథన్ లియాన్ ఒక వికెట్‌తో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశారు.

WTC Final 2023

రెండో ఇన్నింగ్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా తడబడింది. చివరి సెషన్లల్లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. వెంటవెంటనే వికెట్లను పడగొట్టారు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ పెవిలియన్ దారి పట్టాడు. మహ్మద్ సిరాజ్ సంధించిన పర్‌ఫెక్ట్ లెంగ్త్ బంతిని అంచనా వేయలేకపోయాడు వార్నర్. ఆఫ్ స్టంప్ మీదికి దూసుకొచ్చిన బంతి.. అతని ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేతుల్లో వాలింది.

WTC Final 2023

అప్పటికి ఆసీస్ స్కోర్ రెండు పరుగులే. జట్టు స్కోర్ 24 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా అవుట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కేఎస్ భరత్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్ సెంచరీ హీరోలు స్టీవెన్ స్మిత్- 34, ట్రావిస్ హెడ్-18 పరుగులతో ఇన్నింగ్ చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. రవీంద్ర జడేజా వారిద్దరినీ విడదీశాడు. పెవిలియన్ పంపించాడు.

ఆట ముగిసే సమయానికి మార్ముస్ లాంబుషెన్ 41, కామెరాన్ గ్రీన్ 7 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నారు. మొత్తంగా 296 పరుగుల ఆధిక్యతను సాధించింది ఆస్ట్రేలియా. నాలుగో రోజు భారత బౌలింగ్ ఎలా ఉంటుందనే అంశం మీద జయాపజయాలు ఆధారపడ్డాయి. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత బౌలర్లపై ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+