రికార్డ్: పదేళ్లకే హైస్కూల్ చదువు పూర్తి, ఒబామా లేఖ

లాస్ఏంజెల్స్: అమెరికాలోని భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహాం అనే బాలుడు 10 ఏళ్లకే హై స్కూల్ గ్రాడ్యుయేషన్(12వ తరగతితో సమానం) పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు. అంతేగాక అమెరికాలో అతిచిన్న వయసులో హైస్కూల్ చదువు పూర్తి చేసిన వ్యక్తిగా ప్రత్యేకత సాధించాడు కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకు చెందిన అబ్రహాం. తొలుత కిండర్ గార్డెన్‌లో ఉండగానే అతడికి ఆ స్థాయి చదువు మంచినీళ్ల ప్రాయంగా అనిపించేది.

కేజేజిలో చేరీచేరగానే రెండు, మూడు తరగతుల పాఠ్య పుస్తకాలను అలవోకగా చదివేసేవాడు. మూడో తరగతి స్థాయి లెక్కలు సులువుగా చేసేవాడు. అదే విషయాన్ని అందరికీ చెప్పేవాడు కూడా. ఈ నేపథ్యంలో అబ్రహం తల్లిదండ్రులు అతడ్ని పాఠశాలకు పంపలేదు. ఇంట్లోనే టీచర్స్‌ను పెట్టి హైస్కూలు చదువు చెప్పించారు.

10-yr-old Indian prodigy Tanishq Abraham graduates high school in US!

ఏడేళ్ల వయసు నుంచి ఇంటి వద్దనే ఉండి చదువుకున్న అబ్రహాం, పదేళ్లకు హైస్కూలు చదువు పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించడానికి అవరోధంగా నిలిచిన నిబంధనలను తనిష్క్ అబ్రహాం చట్ట ప్రకారమే అధిగమించాడు.
అనుమతులు సాధించి బాగా చదివి పరీక్షలు రాయడమే గాక, మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

చిన్న వయస్సులో హైస్కూలు చదువు పూర్తి చేసిన వ్యక్తిగా అబ్రహాం ప్రత్యకత సాధించాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉత్తీర్ణత ధృవీకరణ పత్రాన్ని అతడు స్వీకరించాడు. మంచి వైద్యుడు కావడం తన కలగా పేర్కొనే తనిష్క్, చిన్ననాటి నుంచీ చదువులో అద్భుతమైన ప్రతిభ కనబర్చేవాడని అతని తల్లి తాజ్ అబ్రహం పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అనుబంధ డిగ్రీని పూర్తి చేసి వైద్యవిద్యను అభ్యసించాలన్నది తన కోరిక అని తనిష్క్ ప్రకటించాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ చిన్నారిని ప్రశంసిస్తూ ఓ లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+