ఆటా సదస్సులో రామా చంద్రమౌళి కవిత్వం
కాలిఫోర్నియా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) యువజన సదస్సు సందర్భంగా ప్రముఖ కవి రామాచంద్రమౌళి ద్విభాషా కవిత్వ సంపుటి కిటికీ తెరిచిన తర్వాత (యాజ్ ది విండో ఓపెన్స్)ని ఆవిష్కరిస్తున్నారు. ఆటా సదస్సు జూన్ 30వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో తెలుగు కవితారీతులపై రామాచంద్రమౌళి ప్రసంగిస్తారు. శ్రీ మురళీ చందూర్ సారథ్యంలోని సాహిత్య సమావేశాల సంఘం ఈ విషయాన్ని తెలియజేసింది.
రామాచంద్రమౌళితో పాటు వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ఆచార్య జ్యోతి కూడా సాహిత్య సమావేశాల్లో పాల్గొని వివిధ సాహిత్యాంశాలపై మాట్లాడుతారు. ఈ విషయాన్ని ఆటా సభల కో కన్వీనర్ గంగుల బుచ్చిరెడ్డి ప్రకటించారు. ఈ ప్రత్యేక తెలుగు మహాసభలకు పద్మభూషన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications