వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాగోలో ఉగాదిసంబరాలు

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగువారి నూతన సంవత్సర ఉగాది ఇక్కడ కొలరాడో అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. రాబోయే శ్రీ వ్యయ నామ సంవత్సరం ఉగాదిని ఏప్రిల్‌ 8వ తేదీన ఇంగిల్‌ ఉడ్‌లోని సింక్లైర్‌ మిడిల్‌ స్కూల్లో నూతనోత్సాహంతో జరుపుకోవడానికి ఇక్కడి కొలరాడోలో తెలుగు సంఘం వారు ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉగాది సంబరాల్లో భాగంగా తెలుగు పాటలు, నృత్యాలు, ఏక పాత్రాభినయాలు, వినోదపరమైన నాటకాలు, మిమిక్రీలాంటివే కాకుండా ఇక్కడి తెలుగువారికి ఉగాది పచ్చడితో పాటు నోరూరించే తెలుగు వంటకాలు కూడా రుచి చూడబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి ఇక్కడ కొలారాడోలో ఉన్న తెలుగు వారందరూ విచ్చేసి ఈ తెలుగువారి సంప్రదాయ ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కొలరాడో తెలుగు సంఘ నిర్వాహక వర్గం కోరుకుంటోంది. ఇక్కడి కార్యక్రమాల్ని తెలుసుకోవాలంటే www.coloradotelugu.org వెబ్‌సైట్‌కు వెళ్లి వివరాలను తెలుసుకోవాల్సిందిగా సంస్థ సాంస్కృతిక కార్యదర్శి భూపతి విహారీ దోనిపర్తి కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X