అమెరికా అంతాతెలంగాణ ఉత్సవాలు
బతుకమ్మ,పిక్నిక్‌లతో ఈ నెల 17వ తేదీనతెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(టిడియఫ్) ఆధ్వర్యంలో అమెరికాఅంతటా పెద్ద యెత్తున తెలంగాణవిమోచన దినోత్సవం జరుపుకున్నారు.తెలంగాణ స్థానీయ పండుగ అయినబతుకమ్మకు చికాగోలో విశేష స్పందనలభించింది. రెండు వందల మందికి పైగాఇందులో పాలుపంచుకున్నారు. చికాగోఈవెంట్ కో ఆర్డినేటర్, టిడియప్‌యుయస్‌ఎ ట్రస్టీ శ్రీనివాస్ పాల్తెపుప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణవిమోచన దినం ప్రాధాన్యాన్నివివరించారు.
న్యూయార్క్‌లోజరిగిన తెలంగాణ విమోచనదినోత్సవాలకు 250 మందికి పైగాహాజరయ్యారు. ఈ ఉత్సవాలకు మాజీ రాష్ట్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) నాయకుడు ఎస్. సంతోష్‌రెడ్డి హాజరై సందేశం ఇచ్చారు.టిడియఫ్ యుయస్‌ఎ అధ్యక్షుడుమధురెడ్డి కూడా ప్రసంగించారు.ఆంధ్రకు చెందిన స్వార్థ శక్తులుతెలంగాణ విమోచ దినం ప్రాధాన్యాన్నిచరిత్ర పుస్తకాల నుంచి చెరిపేశారనిఆయన విమర్శించారు. ఈ చారిత్రకతప్పదిదాన్ని తెలంగాణ మరిచిపోదనిఆయన అన్నారు.
బోస్టన్‌లోవెంకట్ మారోజు, ఫిలడెల్ఫియాలో రవిమేరెడ్డి, కెనడాలో సుధీర్ కోదాటితెలంగాణ విమోచన దినోత్సవాలనునిర్వహించారు.
తెలంగాణఅభివృద్ధి తెలంగాణకు చెందిన ప్రతిఒక్కరూ పునరంకితమవుతారని,గత తప్పిదాలను ఏనాడూ సహించరనిటిడియఫ్ విశ్వస్తోందని టిడియఫ్‌విడుదల చేసిన ప్రకటనలో అన్నారు.రాజకీయాలకు స్వస్తి చెప్పి సామాన్యమానవుడి సమస్యల పరిష్కారానికిఐక్యంగా కృషి చేయాలని టిడియఫ్‌పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications