న్యూజెర్సీలో ఉగాది ప్రదర్శనలు
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడియఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన న్యూజెర్సీలోని బ్రిడ్జిటవున్ ఆడిటోరియంలో ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఉగాది సాంస్కృతికోత్సవాల్లో పొల్లొనడానికి పిల్లలు ఆకర్షణీయమైన వస్త్రాలంకరణతో ఆడిటోరియం చేరుకున్నారు. ఈ ఉత్సవాల్లో దాదాపు 200 కుటుంబాలు పాల్గొన్నాయి. మధు కె. రెడ్డి స్వాగతం చెప్పారు. ఉగాది విశిష్టతను మధు కె. రెడ్డి వివరిస్తూ తెలుగు భాషను నేర్చుకోవాల్సిందిగా పిల్లలకు విజ్ఞప్తి చేశారు. ఆగస్టా నుంచి వచ్చిన టిడియఫ్ బోర్డు చైర్మన్ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా ప్రసంగించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని, జన్మభూమికి ఎన్నారైలను తమ వంతు సహాయం అందించాలని ఆయన అన్నారు.
అనంతరం పిల్లలు తమ తమ ప్రదర్శనలు ఇచ్చారు. నృత్యాలు చేశారు, గానాలాపన చేశారు. జోక్‌లు వినిపించారు. నిత్యా మిట్టా, వరుణ్ దండా, నిఖిల్ పర్వతాల, మోనా నెరెవెట్లా, ప్రణవ్ నెరెవెట్లా, నిహాల్ పర్వతాల, శంతన్ చింతలపాణి, సుధా కొల్లా, రమ్య కొమ్మిడి, స్నేహ భూపతి, యామిని బొక్కా, వరణ్ చింతలపాణి, మోనా నెర్వెట్లా, జీల్, అంజలి, రిమా, రచన, సువినా, రియా, నికిత, సౌమ్య, విగ్నేష్ మద్ది, చేతన్ రెడ్డి తమ ప్రదర్శనలో ప్రేక్షకులను అలరించారు.
అనంతరం టిడియఫ్ బోర్డు సభ్యుడు మేరెడ్డి రవి తమ కార్యకలాపాల గురించి వివరించారు. తెలంగాణ క్యాలెండర్, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో, మహబూబ్‌నగర్‌లో సదస్సుల నిర్వహణ గురించి, నల్లగొండ, పాలమూరు, కరీంనగర్‌లలో ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ గురించి ఆయన వివరించారు.
చాలా కాలం అమెరికాలోని న్యూజెర్సీ ఉండి, భారత్ తిరిగి వచ్చిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఈ ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చారు. ఉత్సవాల్లో విజేతలకు ఆయన సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమాల్లో పాల్గొన్నవారికి, ప్రదర్శనలు ఇచ్చినవారికి టిడియఫ్ కోశాధికారి మురళి చింతలపాణి కృతజ్ఞతలు తెలియజేశారు. సుధాకర్ పెర్కారి, అర్జున్ ద్యాపా, రాజేశ్వర్ గంగసాని, రాజేందర్ జిన్నా, అమర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications