తానా మహాసభలకు బ్యాక్‌ఎండ్ సిద్ధం
వాషింగ్టన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2007లో జరపబోయే మహా సభలకు సన్నాహాలు భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. నిధుల సమీకరణే ముఖ్యోద్దేశంగా ప్రారంభమైన ఈ వేడుకలు వర్జీనియాలోని మెకలీన్ హైస్కూల్ ఆడిటోరియంలో జూన్ 10న జరిగాయి. తానా అధ్యక్షుడు డాక్టర్ బండ్ల హనుమయ్య జ్యోతిని వెలిగించి, అధ్యక్షోపన్యాసం చేయగా, తానా కో-ఆర్డినేటర్ (2007) డాక్టర్ ఎడ్ల హేమ ప్రసాద్ ప్రారంభోపన్యాసంలో కార్యవర్గానికి ఆహూతులకు, వలంటీర్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ ట్రస్టీలు, ఫౌండేషన్ సభ్యులు, కార్యవర్గాన్ని ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సతీష్ వేమన సభకు పరిచయం చేశారు.
తానా ట్రస్టీ అధ్యక్షుడు సతీష్ చిలుకూరి, సెక్రటరీ జానకీరావ్, సభ్యులు మల్లికార్జునరావు చలసాని, డాక్టర్ బాబూరావ్ దొడ్డపనేని ఈ సభకు హాజరయ్యారు. తానా ఫౌండేషన్ అధ్యక్షుడు తిరుమలరావ్ త్రిపురనేని, ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ బండ్ల హనుమయ్య, ప్రెసిడెంట్ ఎలక్ట్ ప్రభాకర్ చౌదరి, కార్యదర్శి జయరాం కోమటి, జాయింట్ సెక్రటరీ హరనాథ్ దొడ్డపనేని, కోశాధికారి ప్రసాద్ తోటకూర, కెనడా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ రామకష్ణ సూరపనేని, నార్త్ ఈస్ట్ ఆర్.వి.పి. దామోదర్ గేదెల, నార్త్ ఆర్.వి.పి. పద్మజారాణి అల్లూరి, మిడ్ వెస్ట్ ఆర్.వి.పి. రాజు రుద్రరాజు, మాజీ అధ్యక్షుడు గంగాధర్ నాదెళ్ళ వేదికపై ఆశీనులయ్యారు. వచ్చే ఏడాది వాషింగ్టన్‌లో జరగబోయే తానా సభలను జయప్రదం చేయాలని తానా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి ఈ సందర్భంగా కోరారు.












Click it and Unblock the Notifications