నల్గొండజిల్లాలో ఎన్నారై వెలిగించిన దీపం
ఒకప్రవాసాంధ్రుడు నల్గొండ జిల్లా సుంకిశాలలోనిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంఅంతర్జాతీయ ప్రమాణాలతో అలరారుతోంది.నల్గొండ జిల్లా ప్రజలు దీనిని మినీ తిరుపతిగాపిలుస్తున్నారు. వెనుకబడిన నల్గొండజిల్లా ప్రజలు తిరుపతి, షిరిడీ, భద్రాచలం వంటిపుణ్య క్షేత్రాలు సందర్శించడానికి ఆర్ధికస్ధోమతు సరిపోవడం లేదని, వారికిఉపయోగకరంగా ఉండేందుకు తనస్వగ్రామమైన సుంకిశాలలో శ్రీ వెంకటేశ్వరస్వామిదేవాలయాన్ని నిర్మించారు ఎన్నారై డాక్టర్‌పైళ్ళ మల్లారెడ్డి. ఈ ఆలయం ద్వారా పేదభక్తులకు ఆధ్యాత్మిక సేవను, స్ధానికులకుకొంత ఉపాధిని కలిగించవచ్చన్న ఆలోచనరాగానే మల్లారెడ్డి ఆచరణ లో పెట్టారు.శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణమైనతర్వాత సుంకిశాల గ్రామం రూపురేఖలు మారిపోయాయి. చుట్టు పక్కల ప్రాంతాల నుంచిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతోఆర్టీసీ బస్సుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం కొన్నిఅభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతోఈ గ్రామం విభిన్నంగా కనిపిస్తోంది. ఈ ఆలయంట్రస్టు అనేక సేవా కార్యక్రమాలనుచేపట్టింది.












Click it and Unblock the Notifications