సిలికానాంధ్రఉగాది ఉత్సవం
అమెరికన్‌తెలుగు అసోసియేషన్ (ఆటా) తొమ్మిదోమహాసభలకు సన్నాహాలు చేసేందుకు ఆటాఎగ్జిక్యూటివ్ కమిటీ లాస్ ఏంజెలెస్‌లో శని,ఆది వారాల్లో సమావేశమైంది. ఆటా తొమ్మిదోమహాసభలు జూన్ 30 నుంచి జులై 2 వరకు లాస్‌ఏంజెలిస్ (కాలిఫోర్నియా) లాంగ్ బీచ్‌కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనున్నాయి.ఎగ్జిక్యూటివ్ కమిటీ: అధ్యక్షుడు మోహన్‌మల్లం, ప్రెసిడెంట్ ఎలక్ట్ చంద్రారెడ్డిగవ్వా, కోశాధికారి చంద్రశేఖర్ పి రెడ్డి,సంయుక్త కోశాధికారి హర్‌నాధ్ పులిచర్ల,ట్రస్టీలు: ప్రేంరెడ్డి,మల్లారెడ్డి పైళ్ళ, వి రావ్ దాల్వాయ్,పరుశురామ్ ఆర్ పిన్నపురెడ్డి,సుధాకర్ జి రెడ్డి, సూర్య ఎం రెడ్డి, ఎవిఎన్‌రెడ్డి, అమూల్యా రెడ్డి, కమల చిమట, సంజీవటి రెడ్డి, జితేందర్ రెడ్డి, ఉమా పిరెడ్డి, విజయ్‌పాల్ రెడ్డి, ఆటా ప్రాంతీయ కోఆర్డినేటర్లు సమావేశానికి హాజరయ్యారు.
తొమ్మిదోఆటా సమావేశం, యువజన సదస్సు కోసంకన్వీనర్‌గా ధర్మారెడ్డి గుమ్మడి నియమితులయ్యారు. కోకన్వీనర్‌గా బుచ్చిరెడ్డి, లోకల్ కో ఆర్డినేటర్‌గా లక్ష్మణ్‌కోకా, కార్యదర్శిగా మల్లిక్ బందా ఎంపికయ్యారు.నేషనల్ కో ఆర్డినేటర్‌గా సంజీవరెడ్డిని,ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్‌గా సుధాకర్ జిరెడ్డిని ఆటా కార్యవర్గం ఎంపిక చేసింది.ఆమెరికా పర్యటనలో ఉన్న నల్గొండ జిల్లా తుంగతుర్తిఎమ్మెల్యే ఆర్ దామోదర్ రెడ్డి కూడా ఆటాకార్యవర్గ సమావేశానికి అతిధిగాహాజరయ్యారు. ఆటా కార్యకలాపాల కోసంహైదరాబాద్‌లో ఒక ప్లాటును కేటాయించవలసిందిగాఆటా కార్యవర్గం ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డిని అభ్యర్ధించింది.
ఆటాకార్యవర్గ సభ్యులు, కో ఆర్డినేటర్లు ఆటాసభల వేదిక అయిన లాంగ్‌బీచ్‌కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించారు.ఎరీనాలో 13,500 మంది కూర్చోడానికి అవకాశముంది.వివిధ కార్యక్రమాల నిర్వహణకు వసతులుఉన్నాయి. వేలాది మంది తెలుగు వారికి భోజన, ఇతరసదుపాయాలు కల్పించడానికి స్ధానిక కమిటీసభ్యులు ఇప్పటి నుంచే శ్రమిస్తున్నారు. ఏ తెలుగుసమావేశానికైనా మంచి తెలుగు భోజనం,వినోద కార్యక్రమాలే హైలైట్. సభలనిర్వహణకు డబ్బు కావాలి కాబట్టి ఒకసాయంత్రం నిర్వహించిన ఫండ్ రైజింగ్‌ఈవెంట్‌లో 1,80,000 డాలర్లు సమీకరించారు. న్యూయార్క్‌కుచెందిన పైళ్ళ మల్లారెడ్డి, కాలిఫోర్నియాకుచెందిన ప్రేంరెడ్డి అత్యధికంగా విరాళాలు ఇచ్చారు. ఆటామహాసభలకు 8 వేల మంది హాజరరవుతారనిచంద్రారెడ్డి గవ్వా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనివివిధ నగరాల్లో ఆటా వేడుకలు డిసెంబర్‌లోజరుగుతాయని ఆటా అధ్యక్షులు మోహన్‌మల్లం తెలిపారు. ఆటా సమావేశాల గురించిఎక్కువ మందికి తెలిసేందుకు అక్టోబర్, నవంబర్‌నెలల్లో అమెరికాలోని వివిధ నగరాల్లోసమావేశాలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications