వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీలో బతుకమ్మ పండుగ

By Staff
|
Google Oneindia TeluguNews

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టిడియఫ్‌) అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్‌, పెన్సిల్వేనియా చాప్టర్లు తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ నెల 16వ తేదీన న్యూజెర్సీలోని థాంప్సన్‌ పార్క్‌లో ఈ పిక్నిక్‌ జరిగింది. న్యూజెర్సీలోని అన్ని ప్రాంతాలకు చెందిన తెలంగాణవాసులు ఈ బతుకమ్మ పండుగకు వచ్చేశారు. సంప్రదాయ దస్తులు ధరించిన మహిళలు రంగు రంగుల బతుకమ్మలతో ఇక్కడికి విచ్చేశారు. ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైన ఈ ఉత్సవం సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది. తమకు లభించిన పూలతో బతుకమ్మలను పేర్చి ఎంపిక చేసిన స్థలంలో ఉంచి బతుకమ్మ ఆడారు. 200 మందికిపైగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమం గురించి చర్చలు జరుపుకునానరు. పిల్లల కోసం టిడియఫ్‌ ఆర్గనైజర్లు మధు కాకులవరం, మురళీ చింతలపాటి, రవి ధన్నపునేని, సురేందర్‌ మద్ది, సుధీర్‌ కోదాటి ఆటలను ఏర్పాటు చేయడంలో బిజీగా గడిపారు. పెద్దలు కూడా మ్యూజికల్‌ చైర్స్‌, పరుగు పందెం వంటి పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు అవార్డులు ప్రకటించారు. తెలంగాణ వంటకాలు లంచ్‌లో అలరించాయి. బూమ్‌ బాక్స్‌ల నుంచి వెలువడుతున్న తెలంగాణ గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను జరుపుకోవడంలో అందరూ చురుకుగా పాల్గొన్నారు. క్యాసెట్స్‌, సిడీల ద్వారా వినిపిస్తున్న ఉయ్యాల పాటలకు చాలా మంది గొంతులు కలిపారు.

తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ మహిళలు బతుకమ్మలను నీళ్లలో వదిలిపెట్టారు. బతుకమ్మ పండుగ తర్వాత విజేతలకు అవార్డుల ప్రదానం జరిగింది. ఆటాకు చెందిన డాక్టర్‌ చంద్రారెడ్డి గవ్వా, డాక్డర్‌ పైల్ల మల్లారెడ్డి, రాజేందర్‌ జిన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ బతుకమ్మలకు కూడా అవార్డులు ఇచ్చారు. డాక్డర్‌ చంద్రారెడ్డి అవార్డులు ప్రదానం చేశారు. డాక్టర్‌ ప్రతాపరెడ్డి, సుధాకర్‌ పెర్కరి, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మా కొల్లా, జైదీప్‌, రావు పుసుకుర్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X