సిడ్నీ పరిసరాల్లో బతుకమ్మ పండుగ

సిడ్నీలోనూ, సిడ్నీ పరిసరాల్లోనూ నివసిస్తున్న తెలంగాణవారు ఈ నెల 17వ తేదీన బతుకమ్మ పండుగను, తెలంగాణ విమోచనోద్యమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాలను తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆస్ట్రేలియా చాప్టర్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దాదాపు 115 మంది పాల్గొన్నారు. పారామట్టా నదీ తీరంలోని మిడో బ్యాంక్‌ పార్క్‌లో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు.

మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వారు మొదటగా తమ తెలంగాణ తల్లి ఎదుర్కుంటున్న ప్రస్తుత సమస్యలపై, గత యాభై ఏళ్ల చారిత్రక సంఘటనలపై, తెలంగాణ పట్ల పాలకుల అణచివేతపై మాట్లాడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఈ ప్రాంత ప్రజలు గుర్తించారని అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ సెంటిమెంట్‌ కాదని, ఇది శాస్త్రీయమైన, వాస్తవాంశాల మీద ఆధారపడిందని నిర్వాహకులు అన్నారు. ఈ మేరకు ఒక వినతిపత్రం రాసి దానిపై అందరూ సంతకాలు చేసి భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు పంపారు. దీని ప్రతిని లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీకి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బర్నాలాకు, బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులకు పంపారు. 1948 సెప్టెంబర్‌ 17వ తేదీ ప్రాముఖ్యతను నిర్వాహకులు శ్రోతలకు వివరించారు. ఆ తర్వాత స్థానికంగా దొరికిన పూలతో బతుకమ్మలను పేర్చారు. తెలంగాణ పురోహితుడు శ్రీమాన్‌ హరి గౌరీ పూజ నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలు పండుగలో ఉత్సాహపూరిత వాతావరణాన్ని తెచ్చి పెట్టాయి. మంగళహారులతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసికెళ్లి పరమట్ట నదిలో వదిలిపెట్టారు. అశ్విన్‌, అశోక్‌, దేవేందర్‌, జయపాల్‌, నరేశ్‌, ప్రమోద్‌, రవీందర్‌, రాజా, రాజశేఖర్‌, వినోద్‌, ఉపేందర్‌ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+