బే ఏరియాలో బతుకమ్మ
అమెరికాలోని బే ఏరియాలో ఇటీవల ఉత్సాహపూరిత వాతావరణంలో బతుకమ్మ పండుగ జరిగింది. దాదాపు 240 మంది తెలంగాణ ఎన్నారైలు ఈ పండుగలో పాలు పంచుకున్నారు. పాలమూర్ ఎన్నారై ఫోరమ్ సహకారంతో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడియఫ్) ఈ బతుకమ్మ పండుగను నిర్వహించింది.
పెద్దవారు రజాకార్లతో జరిగిన పోరును వివరించారు. పిల్లలు ఆ విషయాలను శ్రద్ధగా విన్నారు. ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ విమోచన దినోత్సవంతో కలిపి నిర్వహించుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ సద్దులు తీసుకొచ్చారు. దాదాపు 40 రకాల సద్దులు అక్కడికి చేరాయి. అక్కడంతా తెలంగాణ గ్రామీణ వాతావరణం నెలకొంది. అమెరికాలో బతుకమ్మ ఆడడం ఒక అద్బుతమైన అనుభవంగా మహిళలు భావించారు. హెచ్‌యస్‌యస్ వాలంటీర్ తిరుపతి గందె బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. పిల్లలు క్రికెట్, పెద్దలు వాలీబాల్ ఆడారు.












Click it and Unblock the Notifications