వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెట్రాయిట్‌లో సద్దుల బతుకమ్మ

By Staff
|
Google Oneindia TeluguNews

అమెరికాలోని తెలంగాణవారు ను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా అడుగులు వేస్తూ మహిళలు, బాలికలు బతుకమ్మ ఆడారు. మిచిగాన్‌ నుంచే కాకుండా లాన్సింగ్‌, టోలెడోల నుంచి కూడా తెలంగాణవారు 250 మందికి పైగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

వరగల్‌ ఎన్నారై ఫోరమ్‌ సహకారంతో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఈ బతుకమ్మ పండుగ ఉత్సవాలను నిర్వహించింది. రాంరెడ్డి తన స్వాగతోపన్యాసంతో ఉత్సవాలను ప్రారంభించారు. ఇతర నిర్వహకులు హరి మరోజు, ప్రీతిరెడ్డి, అర్చన సోలిపురంలను ఆయన అందరికీ పరిచయం చేశారు. టిడియఫ్‌ ఆవిర్భావం, దాని లక్ష్యాల గురించి, బతుకమ్మ విశిష్టత గురించి హరి మరోజు వివరించారు. అంతర్గత వలస కారణంగా తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలు నిర్లక్ష్యానికి గురవుతూ మరుగున పడిపోయే స్థితికి చేరుకున్నాయని ఆయన అన్నారు. ఆ ధోరణి తెలంగాణ దేవతలు, పండుగలకు కూడా అదే దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అనంతరం సభకు వచ్చినవారికి సద్దులు పెట్టారు. అనంతరం పిల్లలకు వివిధ విషయాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.

బతుకమ్మ ఆడిన తర్వాత గౌరీ పూజ జరిగింది. అమెరికాకు వచ్చిన ఒక స్త్రీ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడారు. ఆమె పాటకు పలువురు కోరస్‌ ఇచ్చారు. దాదాపు గంటసేపు పెద్దలు, పిల్లలు ఆనందడోలికల్లో తేలియాడారు. అనంతరం బతుకమ్మలను హాల్‌ వెలుపల ఏర్పాటు చేసిన చిన్న సరస్సులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వరంగల్‌ ఎన్నారై ఫోరమ్‌కు చెందిన నగేష్‌, విజయ్‌ మేరెడ్డి, లక్ష్మణ్‌, అనిల్‌ ఎరవర్తి, శ్రీనివాస్‌ ఇమ్మడి, శైలేంద్ర, అశోక్‌ పెరుమాండ్ల, అర్చన సోలిపురమ్‌, ప్రీతిరెడ్డిలకు టిడియఫ్‌ కృతజ్ఞతలు తెలియజేసింది. తీపి జ్ఞాపకాలను తట్టి లేపిన ఈ ఉత్సవంలో పాల్గొన్నందుకు అందరూ ఆనందం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X