తెరాస నిర్ణయానికి ఎన్నారైల స్వాగతం
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కె. చంద్రశేఖరరావు, ఎ. నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడాన్ని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడియఫ్) స్వాగతించింది. ఈ సందర్భంగా తెలంగాణ సాధనకు సంబంధించి అమెరికాలోని టిడియఫ్ కో ఆర్డినేటర్ మధు కె. రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు మూడు విషయాలను ప్రస్తావించారు. తెరాస నాయకత్వం ఇకపై తమతో కలిసి వచ్చే శక్తులన్నింటితో ఒక్క తాటిపై నిలిచి తెలంగాణ వ్యతిరేకులు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ప్రజల, మేధావుల మద్దతుతో ఉద్యమించాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఓపికను పరీక్షిస్తున్న కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఇకనైనా మేలుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గులాబీ కండువా కప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసి కమిట్ అయిన సంగతి ఓటర్లు మరిచిపోరనే విషయాన్ని గుర్తించాలని వారన్నారు.












Click it and Unblock the Notifications