ఆటా రోజు విజయవంతం

ATA celebrationsఅమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) డెట్రాయిట్ చాప్టర్ ఆటా రోజు కార్యక్రమం విజయవంతంగా, ఉల్లాసభరిత వాతావరణంలో జరిగింది. ఈ నెల 7వ తేదీన మిచిగాన్ సౌత్ ఫీల్డ్ లోని మిలీనియం థియేటరులో ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ లక్ష్యాలను తెలుసుకుని, ప్రతి ఒక్కరూ సంస్థలో పాలు పంచుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. సంస్థలో సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ఈ సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధ్య మధ్యలో చంద్రహాస్ సినిమాను ప్రదర్శించారు. చంద్రహాస్ సినిమా నటుడు, నిర్మాత హర్నాధ్ పులిచెర్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆటా అంతర్జాతీయ సమన్వయ కర్త కూడా.

ఈ ఆటా రోజులో దాదాపు 900 మంది పాల్గొన్నారు. ఆటా డెట్రాయిట్ చాప్టర్ లో ఇది చారిత్రక సంఘటన అని ఆట డెట్రాయిట్ ప్రాంతీయ సమన్వయకర్త, కార్యక్రమ నిర్వాహకుడు రాంరెడ్డి అన్నారు. ఒకే రోజు వంద సభ్యత్వ దరఖాస్తులను భర్తీ చేశారు. సంస్థ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ ఏడాది అత్యుత్తమమైందని ఆటా అధ్యక్షుడు డాక్టర్ చంద్రారెడ్డి గవ్వా అన్నారు. తమ సుదీర్ఘ ప్రయాణంలో ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని ఆయన అన్నారు.

ఆటా జాతీయ సమన్వయకర్త విజపాల్ రెడ్డి, ఆటా సంయుక్త కార్యదర్శి రాజు చింతల, ఇండియన్ పోలీస్ ప్రాంతీయ సమన్వయకర్త శేఖర్ కృష్ణమనేని, గ్రేటర్ టోరంటో తెలుగు సంఘం అధ్యక్షుడు సూర్య బెజవాడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజన్ సిస్టమ్స్ గ్రూప్ సిఇవో విశ్వ మండలపు 5 వేల డాలర్లు విరాళంగా ఇచ్చారు. రాంరెడ్డి, సునీల్ మర్రి, రాజు బ్రహ్మానందభేరి, అశోక్ పెరుమాండ్ల, లక్ష్మణ్ రెడ్డి, మురళీ, సూర్య, రాజ్, వెంకటేష్, తిరు, శ్రీధర్, అశ్విని, విజయ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+