ఫిల్డేల్ఫియాలో బతుకమ్మ
ఫిల్డేల్ఫియాలోని తెలంగాణ ఎన్నారైలు తెలంగాణ సాంస్కృతిక సంఘం (టిసిఎ) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. వేలీ క్రీక్ పార్కులో సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలతో, పిల్లలతో పండుగ వాతావరణం నెలకొంది. దాదుపు 50 మంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సంగీతంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సద్దులు, ఐదు రకాల అన్నం, తెలంగాణ కూరలతో మధ్యాహ్న భోజనం చేశారు.
పది రంగు రంగుల బతుకమ్మల పండుగ గౌరీ పూజతో ప్రారంభమైంది. మహిళలు బతుకమ్మ పాట పాడుతూ బతుకమ్మ ఆడారు. పిల్లలకు, పెద్దలకు ఆటల పోటీలు జరిగాయి. మేఘన, వేణు బత్తిన కుటుంబం, నీరజ, సుధీర్ రాజు కుటుంబం, మంజుల, నాగేందర్ కుటుంబం, మాధవి, జయేందర్ కుటుంబం, సౌందర్య, రవి కుటుంబం, జమున, రవీందర్ కుటుంబం ఉత్తమ బతుకమ్మ బహుమతులు గెలుచుకున్నారు. స్వామి సవితానం ధ్యానం ప్రత్యేకతను వివరించారు. బతుకమ్మ పండుగ నిర్వాహకులు సుధీర్ రాజు, సుభాష్ కర్రా, వేణు బత్తిని, రవి మేరెడ్డిలకు టిసిఎ కృతజ్ఞతలు తెలియజేసింది.












Click it and Unblock the Notifications