అమెరికా బతుకమ్మకు విజయశాంతి

అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో మెగా బతుకమ్మ ఉత్సనాన్ని నిర్వహించాలని తెలంగాణ సాంస్కృతిక సంఘం (టిసిఎ) నిర్ణయించింది. ఈ నెల 29వ తేదీన ఫ్రెమెంట్ ఎలిజబెత్ పార్కు సరస్సు వద్ద జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని కాపాడుకుని ప్రోత్సహించడానికి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు టిసిఎ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ విజయ్ చవ్వా చెప్పారు.


ఈ మెగా ఉత్సవానికి సినీ నటి విజయశాంతిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేయి మంది దాకా పాల్గొంటారని విజయ్ చవ్వా చెప్పారు. తెలంగాణ సంప్రదాయం గురించి పిల్లలు ఈ ఉత్సవంలో నేర్చుకుంటారు. మధ్యాహ్న భోజనాన్నిఉచితంగా తెలంగాణ వంటకాలను వడ్డించనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+