తెలుగు విద్యార్థుల మృతికి ఎన్నారైల విచారం
అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల హత్యల పట్ల అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చంద్రశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ ల హత్యలపై పోలీసులు, ఎఫ్ బిఐ దర్యాప్తు చేస్తున్నట్లు ఆటా అధ్యక్షుడు చంద్రారెడ్డి గవ్వా తెలిపారు. ఈ ఇద్దరు కుటుంబాలకు సహాయం అందించడానికి అమెరికాలోని తెలుగువారు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. చంద్రారెడ్డి 5 వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. ఆటా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను స్వస్థలాలకు పంపించడానికి సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అమెరికాలో తెలుగు విద్యార్థుల హత్యలను పాలమూర్ ఎన్నారైలు ఖండించారు. మృతులు కిరణ్ కుమార్, చంద్రశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు పాలమూరు ఎన్నారైల ప్రతినిధి విజయ్ చవ్వా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పాలమూరు ఎన్నారైలు అవసరమైన సహాయం అందిస్తున్నారని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు https://www.lsufoundation.org/kommaallam.php క్లిక్ చేసి సాయం అందించవచ్చు. విషయాన్ని ముఖ్యమంత్రికి సకాలంలో తెలియజేసిన శాసనసభ్యుడు పులి వీరన్నకు ఆయన కృతజ్ఞతలు తెలిజయజేశారు.












Click it and Unblock the Notifications