సోనియాకు న్యూయార్క్ లో నిరసన
అమెరికాలోని న్యూయార్క్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నిరసన వ్యక్తం చేయాలని అమెరికాలోని తెలంగాణ ప్రవాసులు నిర్ణయించుకున్నారు. వచ్చే నెల 2వ తేదీన సోనియా న్యూయార్క్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్లు మేరెడ్డి రవి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజల ఆకాంక్షను సోనియాకు తెలియజేయడానికి ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ పట్ల సాగుతున్న దోపిడీ, అణచివేత చర్యలకు రాష్ట్రం ఏర్పాటు ద్వారా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని అయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి అనమతి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications