ఆటా సమావేశాలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నిధుల సేకరణ సమావేశం ఉత్తర కాలిఫోర్నియాలో విజయవంతంగా జరిగింది. లక్ష డాలర్లకు పైగా నిధుల సేకరణ జరిగింది. మొదటి నిధుల సేకరణ సమావేశం సిఎ, హాన్ ఫోర్డులోని ఝాన్సీ రాజేందర్ రెడ్డి నివాసంలో జరిగింది. ఈ సమావేశానికి ఆటా అధ్యక్షుడు డాక్టర్ చంద్రారెడ్డి గవ్వా, సుధాకర్ రెడ్డి, నార్త్ కాలిఫోర్నియా ఆటా సమన్వయకర్త బుచ్చన్న గాజుల హాజరయ్యారు. డాక్టర్ చంద్రారెడ్డి ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటా సమావేశాలకు సంబంధించిన ప్రణాళికను ఆయన వివరించారు. ఈ సమావేశాలకు పెద్ద యెత్తున హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు.
రెండో విందు సమావేశం సిఎ సాన్ జోస్ లోని రామి, ఇందిరా రామిరెడ్డి నివాసంలో ఏప్రిల్ ఐదవ తేదీన జరిగింది. ఈ సమావేశానికి బే ఏరియా పారిశ్రామికవేత్త, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. తమ సంస్కృతి గొప్పతనాన్ని, దాన్ని తమ వారసులకు అందించాల్సిన అవసరాన్ని గవ్వా చంద్రారెడ్డి, రామిరెడ్డి వివరించారు. న్యూజెర్సీలో జరిగే ఆటా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆయన ప్రవాసాంధ్రులను కోరారు. ఫిలాంత్రోపిస్తు డాక్టర్ హనిమి రెడ్డి మాట్లాడారు. ఆటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం ఆటా సమావేశాల ప్రత్యేకతను వివరించారు. లక్కిరెడ్డి హన్మి రెడ్డి, రాంరెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ప్రహ్లాద్, విజయ చవ్వా, ఎన్. దామోదర్ రెడ్డి, మధు కిర్స్, జయరాం కోమటి, ప్రవీణఅ, డాక్టర్ గోపి రెడ్డి, సురేష్ రెడ్డి వుయ్యూర, శ్రీనివాస్ మనప్రగడ తదితరులు ఈ కార్యక్రమానికి సహకరించారు.












Click it and Unblock the Notifications