గ్రేటర్ చికాగోలో 'ఆటా రోజు'
చికాగో: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో సహకారంతో మే 3 వ తేదీన గ్రేటర్ చికాగో హిందూ దేవాలయంలో "ఆటా డే"ను నిర్వహించింది. ఆంధ్రా ఆహార పదార్ధాలను ఆహూతులకు పంచారు. స్నాక్స్ సమయం ఆహుతులు ఒకరినొకరు పరిచయం చేసుకోడానికి చక్కని అవకాశంగా ఉపయోగపడింది. జులై 3 నుంచి ఐదో తేదీ వరకు న్యూజెర్సీ న్యూఆర్క్ ప్రుడెన్షియల్ సెంటర్ లో ఘనంగా జరగబోయే ఆటా పదో సమావేశం, యూత్ కన్వెన్షన్ కి ముందుగా "ఆటా డే" నిర్వహించారు.
ఆటా ట్రస్టీ శ్రీమతి బొక్కా రోహిని ఆహుతులను, పెద్దలను ఆహ్వానించారు. చిన్నారులు ప్రకాశ్, సంతోష్ టాటాల గణపతి శ్లోకంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆటా అధ్యక్షులుగా ఎన్నికైన జితేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనగావించారు. శ్రీమతి కమలా చింతామణి, శ్రీ రమణమూర్తి యెడవల్లి గా వ్యవహరించారు. కళాకారులు, ఆహుతులు తెలుగు సాంప్రదాయ దస్తుల్లో వచ్చి మన సాంప్రదాయాన్ని ప్రతిభింబించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హేమ యద్దనపూడి కూచిపూడి నాట్య కళాశాల విద్యార్దులు సెమి క్లాసికల్ నృత్యం ప్రధర్శించారు. అనంతరం చిన్నారులు తమ నాట్య ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు.
అమెరికాలో పదో ఆటా సమావేశాలును తిలకించడానికి వెళ్తున్న తెలుగు వారి శంశాబాద్ విమానాశ్రయంలోని సంభాషణను తమ ప్రాంతీయ యాసను అనుకరిస్తూ ఎన్.జె. శ్యామ్ పప్పు, రోహిని బొక్క, రమణ మూర్తి యెడవల్లి లు ప్రదర్శించిన "ఆటా సంబరాలు" అనే స్కిట్ ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. 'అలెక్స్' సినిమాతో పాపులర్ అయిన నటుడు హరినాద్ పలక్చర్ల భారతం, భాగవతం లోని పధ్యాలను వినిపించారు. 'తరనా డాన్స్ అకాడమీ' శీతల్ ధరణి విధ్యార్దులు ప్రదర్శంచిన కథక్ న్యాట్యప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. "కూల్ మిర్చి" వారి రుచికరమైన ఆంధ్రా శాఖాహారాన్నిరాత్రి 8:30 విరామంలో వడ్డించారు.
డిన్నర్ అనంతరం 'లైవ్ ఆర్కెస్ట్రా' వారు పాత, క్రొత్త తెలుగు పాటలతో రాత్రి 9:00 నుండి అర్ధరాత్రి12:00 వరకు ఆహుతులను రంజింపజేసారు. లక్ష అమెరికా డాలర్లు విరాళంగా వచ్చాయి.ఆటా అధ్యక్షులు డాక్టర్ చంద్రారెడ్డి, ఆటా అధ్యక్షులు ఎలెక్ట్ జితేందర్ రెడ్డి, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ హరినాద్ పులిచర్ల,ఆటా వ్యవస్దాపకులు హనుమంతరెడ్డి తదితరుల సహకారంతో ఆటా డే ఘనంగా జరిగింది. పదో ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ బలరామ్ పమ్మి కార్యక్రమ వివరాల్ని వివరించారు. యెడవల్లి రమణమూర్తి ముగింపు ఉపన్యాసమిచ్చారు.












Click it and Unblock the Notifications