కాలిఫోర్నియాలో 'బతుకమ్మ' పండుగ

బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించే వ్యాసాన్ని మేఘనా ద్రోపతి, మనీషా ఉప్పల చదివి విన్పించారు. మధ్యాహ్నం సంప్రదాయిక తెలంగాణ భోజనం చేసిన తర్వాత మహిళలు రంగు రంగుల పట్టు చీరలు ధగ ధగ మెరుస్తుండగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ చుట్టూ అంత పెద్ద సంఖ్యలో మహిళలు సంప్రదాయకంగా నృత్యం చేయడం నిర్వాహకులనే ఆశ్చర్యపరిచింది. కొందరికి ఇది తొలిసారి అనుభూతి. ఉత్తమ బతుకమ్మ అవార్డు కవితా ఉప్పలకు దక్కింది. ఈ సందర్భంగా వివిధ రకాల క్రీడలను నిర్వహించారు.
స్పాన్సర్లు అయిన ప్రభా దునేజా, డాక్టర్ గోపాల్ రెడ్డి గాదె లకు నిర్వాహకులు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఈ కార్యక్రమాని విజయవంతం చేయడానికి అల్వాల్ పుట్టా, బస్వరాజు ఉప్పల, జగన్ బేరెల్లి, రాజారెడ్డి కప్పెర, రాజేష్ రెడ్డి ఒట్టిపెల్లి, సోమశేఖర్ కంచర్ల, శ్రీకాంత్ మోత్కుపల్లి, శ్రీనాధ్ మస్కుల అహర్నిశలు శ్రమించారు. రమా కప్పెర, శైలజా బేరెల్లి, దీపక్ చిగుళ్ళపల్లి, ఎల్ విఎన్ రెడ్డి, గణేశ్ చిరువూరి, చంద్ర అనంతునిలను కూడా నిర్వాహకులు అభినందించారు. అక్టోబర్ 25 న మధ్యాహ్నం రెండు గంటలకు టిడిఎఫ్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా ఫ్రెమాంట్ లోని పార్క్ థియేటర్లలో బతుకమ్మ సినిమాను ప్రదర్శించనున్నట్టు నిర్వాహకులు సోమ్ కంచర్ల ఒక ప్రకటనలో తెలియజేశారు. వివరాలకు సోమ్ ను ఈ నెంబరులో సంప్రదించవచ్చు 408-981-6848.












Click it and Unblock the Notifications