చికాగోలో తెలుగు సాహితి

సాహితీ మిత్రులు సంఘం అధ్యక్షులు డాక్టర్ రవిరెడ్డి తాను ఇటీవల చదివిన డాక్టర్ కోడూరు ప్రభాకర రెడ్డి పల్నాటి చరిత్ర ఖండ కావ్యంలోని పద్యాలను పరిచయం చేశారు. ప్రభాకర రెడ్డి ఇతర రచనలను ప్రస్తుతించారు.
నైజాం పాలనను సమర్థిస్తూ ఇటీవల కెసిఆర్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణలో నైజాం పాలన ఎంత ఘోరమైందో కళ్లకు కట్టిననట్లు చూపై దాశరథి రంగాచార్య మోదుగుపూలు నవల గురించి మెట్టుపల్లి జయదేవ్ ప్రస్తావించారు.
తిమాపురం ప్రకాశ్ తనకు నచ్చిన మందపాటి సత్యం అమావాస్య చంద్రుడు కథ గురించి ప్రస్తావిస్తూ మరణం అనేది అతి సహజమైనా మనకు దాని పట్ల ఉండే భిన్న అభిప్రాయాలను మందపాటి సత్యం చిత్రీకరించిన తీరును కొనియాడారు. డాక్టర్ చింతం రాణి సుయుక్త రాయలసీమ కన్నిటీ గాథను వివరించే విద్వాన్ విశ్వం పెన్నేటి పాటను రాగయుక్తంగా చదివారు. పెన్నా నదీ పరీవాహక ప్రాంతం అలనాటి ఆర్థిక పరిస్థితిపైన, ఈనాటి ఎండిపోయిన పెన్నా దైన్యస్థితి మీద చర్చ జరిగింది.
అశోక్ ముద్రకోల తన స్వీయకవిత గడ్డం చదివి వినిపించారు. వివిధ రకాల పేర్లు కలిగి వివిధ మతాలకు గడ్డం గుర్తింపు పొందిందో హాస్సరీతిలో వర్ణించారు. సామా రామిరెడ్డి, వెన్నెలకంటి రఘు, అప్పలనేని పద్మారావు తమకు ఆసక్తికరమైన తెలుగు సామెతలు, నుడికారాల గురించి మాట్లాడారు. తాతా ప్రకాశం విజయనగరం పుస్తరం గురించి ప్రస్తావించారు.
సత్య గోపాలం, రవీంద్ర, బడ్డి రాఘవేంద్ర, చింతం సుబ్బారెడ్డి, శశి, ఉష తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. చికాగో సాహితీ మిత్రులు సంఘ కార్యదర్శి శారద మెట్టుపల్లి వందన సమర్పణ చేశారు. మార్చి 22న చికాగో సాహితి మిత్రులు తదుపరి సమావేశం జరుగుతుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications