తెలంగాణ ఎన్నారైల లొల్లి
తెలంగాణవాదులంతా ఏకమై తెలంగాణ శ్రేయస్సు కోసం 199లో ఒక సంస్థలా ఏర్పడి, రెండేళ్ల కింద స్పర్థలు వచ్చి తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా), తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) అని రెండు సంస్థలుగా విడిపోయింది. పరాయి దేశం వెళ్లి స్థిరపడి, తెలుగువారంతా ఒక్కటై వేడుకలు చేసుకుని అందులో విభజనలు ఏర్పడి చాలా ఏళ్ల క్రింద రెండు వేర్వేరు సంస్థలై ఆటా, తానాగా ఏర్పడ్డ సంగతి అందరికీ విదితమే. పరాయి దేశంలో ఉంటూ మాతృభాష, ప్రాంతీయవాద ప్రియులు విడిపోయే సంఘటనలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి.
ప్రస్తుత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ సానుకూల పార్టీలన్నీ పొత్తులు పెట్టుకుంటే తెలంగాణ ఎన్నారై సంఘాలు ఇట్లా విడిపోవడం భావ్యమైనా. నవంబర్ ఒకటిన వాషింగ్టన్ డిసిలో తెనా చేపట్టిన తెలంగాణ విద్రోహ దినం ధర్నా అనంతరం తెనా, టిడిఎఫ్ కార్యవర్గ సభ్యులను శ్రేయోభిలాషులు కొందరు ఒక్క వేదిక మీదికి చేర్చి రహస్య మంతనాలు చేసినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా, ముందున్న ఎన్నికల దృష్ట్యా అయినా కలిసి పనిచేస్తే బాగుంటుందని కొందరు సభ్యులు, శ్రేయోభిలాషులు చెప్పినా వాటికి ఘాటైన విమర్శలు ఎదురైనట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసమైనా తెనా, టిడిఎఫ్ కలిసి పనిచేసే వాతావరణం ఇప్పుడు ఉన్నదా, లేదా. ఒక వ్యక్తికన్నా నైపుణ్యంతో సమస్యలను పరిష్కరించవలసిన సంస్థలు ఇలా దెబ్బలాడుకోవడం సరైందైనా. ఈ సంస్థలు కలిసి పని చేయాలా, వద్దా. పని చేస్తే ఒరిగేదేమిటి.












Click it and Unblock the Notifications