ఇండియానాపోలిస్ లో 'ఆటా' పాటా

అనంతరం ఉత్సాహపూరిత వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. జులై ఆటా సదస్సులో ప్రదర్శించే ప్రవాస తెలుగువారి ఆటా పాటలు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రదర్శించి చూపారు. దీనికి డాక్టర్ సుజాత పమ్మి, శారద కొచ్చెర్లకోట దర్శకత్వం వహించారు. ఆటా జాతీయ సమన్వయకర్త డాక్టర్ విజయపాల్ రెడ్డి ఆటా కృషిని, దాని విజయాన్ని వివరించారు. అమెరికాలోని తెలుగు యువత ఆటా సదస్సు సందర్భంగా ఇచ్చే కార్యక్రమాలను వివరించారు. సదస్సుకు వచ్చే రాజకీయ నాయకుల, టాలీవుడ్ తారల, ఆధ్యాత్మిక గురువుల వివరాలు అందించారు.
ఆటా భారతదేశంలోని గ్రామాల్లో అందిస్తున్న సేవలను, ఆటా విజయాలను, రాబోయే సదస్సు వివరాలను ఆటా అధ్యక్షుడు డాక్టర్ చంద్రారెడ్డి గవ్వా తెలియజేశారు. ఆటా కోశాధికారి భారతి పుల్లూరూ, యూత్ కమిటీ కో చైర్ డాక్టర్ మానసారెడ్డి, అవార్డుల కమిటీ చైర్ డాక్టర్ సాంబిరెడ్డి మాట్లాడారు. అనునిత నట్టం, సాయి అంబటి, సూయిత్ మాలపెద్ది, కార్తిక్ రెడ్డి, సందీప్ పామిరెడ్డి, నికిత లట్టుపల్లి నృత్యప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. రాజారెడ్డి అవుతు కామెడీ షో ఇచ్చారు. డాక్టర్ జయప్రద కొనిజేటి తెచ్చిన లడ్డు అందర్నీ ఆకర్షించింది. ఈ సందర్భంగా విశేషంగా నిధుల సేకరణ జరిగింది.












Click it and Unblock the Notifications