నేతన్నల కోసం పాలమూరు ఎన్నారైలు

నేత కార్మికుల సమస్యలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పాలమూరు ఎన్నారైలు పాలమూరు డేను నిర్వహించారు. తమ ఉత్పత్తులను అమ్ముకుని పొట్ట పోసుకోవడంలో రాష్ట్రంలోని నేత కార్మికులు తీవ్రమైన ఇక్కట్లకు గురవుతున్న విషయం తెలిసిందే. అవసరాలు తీరక నేత కార్మికులకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కనీసం ఏడాదికి ఒక్కసారైనా రాజకీయ పార్టీలు నేత కార్మికలు సమస్యలపై దృష్టి సారించి వారికి సాయపడేందుకు ముందుకు వస్తే మంచిదని విజయ్ చవ్వా అన్నారు. పాలమూర డే సందర్భంగా పాలమూరు ఎన్నారైలు రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించారు. ఖాదీ పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి శనివారం ఖాదీ వస్త్రాలు ధరించాలని పాలమూరు ఎన్నారైలు రాజకీయ నాయకులను, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులను, అధికారులను, వృత్తి నిపుణులను కోరారు. అయితే దానికి అంత ప్రోత్సాహం లభించలేదు. ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అది సరిగా అమలు కావడం లేదు. ఈ జీవో అమలుకు మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు ఎన్నారైలు కృషి చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ నేత కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతున్నాయని, తాము ఈ సమస్యలను ఏడాది క్రితమే గుర్తించామని, నేత కార్మికులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నామని విజయ్ చవ్వా చెప్పారు. న్యూజెర్సీలో ఆటా కార్యక్రమం సందర్భంగా జులై 5వ తేదీని ఖాదీ డేను ప్రకటించామని, ఖాదీ వస్త్రాలు ధరించాలని అందరికీ విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. భారత దేశంలోని నేత కార్మికులకు సంఘీభావం తెలియజేయడానికి ఆ ఖాదీ డేను పాటించినట్లు తెలిపారు. గద్వాల పట్టు చీరలు, నారాయణ పెట్ కాటన్, తదితర ఉత్పత్తుల మార్కెంటింగుకు నేత కార్మికులు తమను పాలమూరు డే సందర్భంగా కోరినట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛంద సేవ ప్రాతిపదికపై తాము పాలమూరు నేత కార్మికుల ఉత్పత్తుల మార్కెటింగును వెబ్ ద్వారా చేపట్టాలని నిర్ణయించామని ఆయన వివరించారు. చాలా మంది కృషి వల్ల http://paalamoorstore. com/ ని ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications