ఆస్టిన్ లో తెలంగాణ సదస్సు

అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఇటీవల ఆస్టిన్ లో సదస్సు నిర్వహించింది. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధి ప్రొఫెసర్ కోదంరామ్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు వివిధ వర్గాలకు చెందిన 30 మంది విద్యావంతులు హాజరయ్యారు. వైద్యులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. చంద్రశేఖర రెడ్డి, సుభాష్ రెడ్డి, రమణారెడ్డి, డాక్టర్ కుమారస్వామి, శ్రీనివాస్ జిల్లిపెల్లి, నర్సిరెడ్డి, భాస్కర్ చౌదరి, చైతన్య కొమ్మిడి, భూపాల్ బర్రె వంటి ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

తెలంగాణ చరిత్ర, వివిధ తెలంగాణ పోరాటాలు, తెలంగాణ ప్రాంతానికి జరిగిన ఆర్థిక, సాంస్కృతిక అన్యాయం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ మనుగడకు అవకాశాలు వంటి అంశాలపై కోదండరామ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎన్నారైలు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి ఎన్నారైలు నిర్వర్తించగల కార్యక్రమాలపై కూడా ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేస్తున్న వివిధ తెలంగాణ సమూహాలను ఏకతాటిపైకి తేవడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక చేస్తున్న కృషిని కూడా ఆయన వివరించారు. టిడిఎఫ్ ఆస్టిన్ చాప్టర్ కు చెందిన రఘు జడల, శివారెడ్డి దాసరి ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఆస్టిన్, టెక్సాస్ లను తెలంగాణ మేధావులు సందర్శించినప్పుడు ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయాలని ఎన్నారైలు నిర్ణయించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+