దేవేందర్ బాట పట్టిండి: ఎన్నారైలు

తెలంగాణ కోసం తెలుగుదేశంలోని నాగం జనార్దన్ రెడ్డి, కాంగ్రెసులోని జీవన్ రెడ్డి, డి. శ్రీనివాస్ తగిన నిర్ణయాలు తీసుకోవాలని టిడిఎఫ్ అధ్యక్షుడు మధు రెడ్డి అన్నారు. దేవేందర్ గౌడ్ చర్య తెలంగాణ నాయకులకు తాము అనుసరించాల్సిన మార్గాన్ని చూపుతోందని టిడిఎఫ్ చైర్మన్ పురుషోత్తమ రెడ్డి గడ్డం అన్నారు. దేవేందర్ గౌడ్ తో తాము మాట్లాడామని, తమ సహాయం ఏ రూపంలో ఉండాలనే విషయాన్ని ఆయనతో చర్చించామని టిడిఎఫ్ ఆస్ట్రేలియా ప్రతినిధి డాక్టర్ వినోద్ రెడ్డి ఏలేటి అన్నారు. ఆంధ్ర ఆధిపత్యంలోని పార్టీలను వదిలి పెట్టాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం పని చేయాలని తాము కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లోని తెలంగాణ నాయకులను ఎస్ ఎంఎస్ ల ద్వారా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్, పెద్ది రెడ్డి రాజీనామా చేసినందుకు తాము సంబరాలు జరుపుకుంటున్నామని తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ చెప్పింది. తెలంగాణ ప్రజలతో చేతులు కలపాలని అన్ని పార్టీల్లోని తెలంగాణ నాయకులకు అసోసియేషన్ ప్రతినిధి రవి మేరెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications