చికాగోలో సాహితీ సభ
హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో లెమాంట్, ఇల్లినాయి నందు చికాగో సాహిత్య మిత్రులు సాహితీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆచార్య పరిమి రామనరసింహం పద్యం - దాని చమత్కారం అనే అంశంపై ప్రసంగిస్తారు. ఈ సభ ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరుగుతుంది.
వక్త పరిమి రామనరసింహం గుంటూరు జిల్లా అమరావతి వాస్తవ్యులు. ప్రస్తుతం చికాగో యూనివర్శిటీలో దక్షిణ ఆసియా భాష - నాగరికత విభాగంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అంతకు ముంగు ఆయన మైసూరులోని భారత భాషల కేంద్రీయ సంస్థ తెలుగు విభాగంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధిపతిగా పనిచేశారు. రామనరసింహం భాషా శాస్త్రంలో విశిష్ట పరిశోధన చేశారు. అవధానంలో కూడా ఆయన సిద్ధహస్తులు.
సమావేశ వివరాలకు ప్రకాశ్ తిమ్మాపురం (630 - 795 - 1424) లేదా జయదేవ్ మెట్టుపల్లికి (630 - 375 - 0131) ఫోన్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications