కాలిఫోర్నియా సాహిత్య సదస్సు

పాశ్చాత్య సాహిత్యంలో అభివృద్ధి చెందినంతగా తెలుగు సాహిత్య విమర్శ ఎదగలేదనీ, ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో విమర్శకీ, సమీక్షకీ తేడా లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పాశ్చాత్యులు అనుసరించే సైద్ధాంతికపరమైన విమర్శానా పరికరాలను ఉపయోగిస్తే తెలుగు సాహిత్యంలో విమర్శ మరింతగా పెరుగుతుందని, దానికి సరైన అర్హత కలిగినవారు ప్రవాసాంధ్రులేనని ఆయన అన్నారు.
సాహితీ సదస్సు సీత నిష్టల వీణా వాదన ప్రార్థనా గీతంతో ప్రారంభమైంది. ఈ సభకు కాలిఫోర్నియా నలు మూలల నుంచి దాదాపు రెండు వందల మంది వచ్చారు. పలువురు ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగించారు. సంప్రదాయ సాహిత్య విభాగంలో ఆదికవి నన్నయ రీతిపై ఉపద్రష్ట సత్యం, శ్రీ విశ్వనాధ వారి రామాయణ కల్పవృక్షం విశిష్టతపై గండవరపు పుల్లమాంబ, కావ్యాలలో పద్య సౌందర్యంపై కెవియస్ రామారావు, పోతన భాగవతంలో హాస్యంపై తాటిపాముల మృత్యుంజయుడు, కర్ణాటక శాస్త్రీయ సంగీతం - పరిశీలనపై అపర్ణ (మునుకుట్ల) గునుపూడి, ఆధునిక సాహిత్యం విభాగంలో ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు అనువాదాల ఆవశ్యకతపై హెప్సి సుంకరి, ఆధునిక సాహిత్యంలో హితం ఎంతపై వంశీ ప్రఖ్య, తెలుగులో నిలబడిన హాస్యంపై సురేంద్ర దారా, అమెరికాలో తెలుగు భాషాబోధనపై శివచరణ్ గుండా, తెలుగు కథల్లో పాత్రల చిత్రణపై మాచిరాజు సావిత్రి, మనకు తెలియని శ్రీశ్రీ సాహిత్యంపై గోపాల్ నేమన ప్రసంగించారు.
సాయంకాలమయ్యింది గొల్లపూడి మారుతీ రావు నవలా పరిచయం కిరణ్ ప్రభ చేశారు. సినిమా పాటల్లో సాహిత్యంపై చిమట శ్రీనివాసరావు, గజల్ సాహిత్యంపై తల్లాప్రగడ రావు, తెలుగు కథా పరిణామంపై కోటేశ్వరరావు ప్రసంగించారు. ఇంకా వంగూరి చిట్టెన్ రాజు స్వీయ కథా పఠనం, కుమార్ కలగర, స్వాతి శ్రీపాద కవితా పఠనం, పిట్టా నారాయణ పద్య పఠనం కావించారు. సాయి బ్రహ్మానందం గొర్తి సంపాదకత్వంలో వెలువడిన వెన్నెల్లో హరివిల్లు అనే కధా సంపుటిని రఘు మల్లాది ఆవిష్కరించారు. ఆ సభకు శివచరణ్ గుండా సమన్వయకర్తగా వ్యవహరించారు. రవి కోనేరు, మురళి చందూరి వితరణతో నిర్వహించిన ఈ సాహితీ సదస్సు సాయి బ్రహ్మానందం గొర్తి ఆధ్వర్యంలో విజయవంతమైంది.












Click it and Unblock the Notifications