సియాటల్ లో ఉగాది వేడుకలు
అమెరికాలో సియాటల్ నగరంలోని తెలుగువారు సర్వధారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలను వాషింగ్ట్ తెలుగు సమితి ఏర్పాటు చేసింది. ఉగాది రోజున సియాటల్ నగర వాస్తవ్యుడు, వేద పండితుడు డాక్టర్ దీక్షిత్ పరాశరం పంచాంగ పఠనం చేశారు. సియాటిల్ వేదిక్ కల్చరల్ సెంటర్ ప్రోత్సాహంతో పిల్లలకు తెలుగు బడిని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వేప పూతతో ఉగాది పచ్చడి చెసి అందరికీ పంచి పెట్టారు.
ఉగాది సందర్భంగా 12వ తేదీన న్యూపోర్టు హైస్కూల్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగాయి. దాదాపు నలబై అంశాలలో జరిగిన కార్యక్రమంలో 210 మంది పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. తెలుగు పాటలు, భరత నాట్యం, సినిమా పాటల నృత్యాలు, నాటికలు వంటి అంశాలతో కార్యక్రమాలు అలరించాయి. అమెరికా జాతీయ గీతంతో ప్రారంభమైన కార్యక్రమం చివరగా భారత జాతీయ గీతం ఆలాపనతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎన్నడూ లేని విధంగా 700 మంది తెలుగువారు వచ్చారు. ఈ సందర్భంగా తెలుగువాణి అనే పత్రికను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications