అమెరికాలో బతుకమ్మ సందడి

తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఆధ్వర్యంలో న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిల్డేల్ఫియాల్లో కూడా బతుకమ్మ పర్వ దినాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ నెల 20వ తేదీన ఇక్కడ బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. న్యూయార్కులో రంగు రంగుల వస్త్రధారణతో మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాలను పెట్టారు. పిల్లలు, పెద్దలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, న్యూజెర్సీ అసెంబ్లీ మెంబర్ ఉపేంద్ర చివుకుల న్యూజెర్సీ ఉత్సవాలకు హాజరయ్యారు. ప్రథమ బహుమతిని స్మిత, సుజాత వొడ్డిలకు ఉపేంద్ర చివుకుల ప్రదానం చేశారు. ద్వితీయ బహుమతిని సరితకు, ఆమె మిత్రులకు, తృతీయ బహుమతిని వరూధిని, నందిని దుర్గలలకు అందించారు. నాలుగో బహుమతిని జమున పుష్కూర్ కు, ఐదో బహుమతిని భవాని కమల్ కు ప్రదానం చేశారు. ఆరు, ఆ లోపు వయస్సు గల పిల్లలకు నిర్వహించిన పరుగు పందెంలో సూరజ్ కూర, సిద్ధాంత్ షకీలి బహుమతులు గెలుచుకున్నారు. వివిధ పోటీల్లో బహుమతి పొందినవారికి అవార్డులు పొందారు.
వాషింగ్టన్ డీసీలో పెద్ద యెత్తున ఈ నెల 19వ తేదీన బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు. లేక్ ఫెయిర్ పార్కులో ఈ పర్వదినం జరిగింది. దాదాపు 350 మంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. టీవి 9 సిఇఒ రవి ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తెలుగు సంస్థల సహకారంతో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఈ కార్యక్రమాన్ని నిర్వించింది. కళ్యాణ్ ముద్దసాని, ప్రవీణ్ శ్యామల, రాజేష్ బాదం, విష్ణు ప్రసాద్, ప్రదీప్ నాగూరు, అమర్ జన్నుపురెడ్డి, శ్రీనివాస్ విప్పా, బాలకృష్ణ పాట్లూరి, అనిల్ కాసినేని, ప్రశాంత్ పురం, రాజేష్ మాదిరెడ్డి ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. ఉత్తమ బతుకమ్మలకు స్వర్ణ వీర్ల, మంజు తుమ్మల, సునీత గడప, శ్వేత ముద్దసాని బహుమతులు గెలుచుకున్నారు. టొరంటోలో కూడా బతుకమ్మ పర్వదినం ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగింది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications