ఎన్నికల ఫలితాలపై మన రాష్ట్రంలో భారీ బెట్టింగ్ లు జరుగుతున్నాయి. శనివారం రోజు సెలవు పెట్టుకుని ఇంట్లోనో, మిత్రులతో మరెక్కడో రిలాక్స్ అవుతూ టీవీ చానల్స్ లో ఇంటర్నెట్ లో ఎన్నికల ఫలితాలు తెలుసుకోడానికి చాలామంది ఇప్పటినుంచే ప్లాన్ చేసుకున్నారు. అమెరికాలో అయితే ప్రవాసాంధ్రుల కోసం పసందైన ఏర్పాట్లు జరిగాయి. ఎన్నారైల ఎన్నికల ఫలితాల హంగామా అంతా ఇంతా కాదు. రాత్రి ఎనిమిదిన్నరకు (రిలాక్స్ అవుతూ ఎన్నికల ఫలితాలు వీక్షించడానికి మంచి సమయం) వివిధ అమెరికన్ నగరాల్లో ఎన్నికల ఫలితాల హంగామా జరుగనుంది. సిఎ, ఫ్రెమాంట్, ఫ్రెమాంట్ హబ్ లోని హైదరాబాద్ బిర్యానీ హౌస్ లో వివిధ రాజకీయ పార్టీల (కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, లోక్ సత్తా, బిజెపి) అభిమానులు టీవీ 9 లో ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను తెలుసుకోడానికి ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు చంద్రు శీలం, శ్రీనివాస మానాప్రగడ, శ్రీకాంత్ పలివెల, రామ్ తోట, శేఖర్ గంజి తెలియజేశారు. డ్రింక్స్, ఫుడ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. లాస్ ఏంజెలిస్, చికాగో, వాషింగ్టన్, అట్లాంటా, న్యూజెర్సీ, న్యూయార్క్, డెట్రాయట్, డల్లస్, యుకె, ఐర్లాండ్, జర్మనీ, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలోని స్ధానికులను సంప్రదించి అక్కడ కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నామని శ్రీనివాస్ మానాప్రగడ ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ నెం: 510 793 3353.