బ్రిటన్ లో భారత విద్యార్ధుల 'ఆకలి రాజ్యం'

స్వదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉండటంతో భారతీయ విద్యార్థులు యూకే నుంచి తిరిగి వచ్చేందుకు కూడా ఆసక్తి చూపటంలేదని బీబీసీ డాక్యుమెంటరీ పేర్కొంది. కాగా..ఈ సంవత్సరం ఏఫ్రిల్ నెలలో పాయింట్లవారీ వలస విధానం ప్రవేశపెట్టాక యూకేకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య మూడింతలు పెరిగింది.
స్వల్పకాలిక ఉద్యోగం సంపాదించి కళాశాలల్లో విద్యాభ్యాసం కొనసాగించవచ్చని చాలామంది అక్కడికి తరలివెళ్ళారు. అయితే ఉద్యోగం దొరకని నేటి పరిస్థితుల్లో తీవ్ర నిరాశకు గురైన వారు తిండి కూడా లేకుండా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారని బీబీసీ తెలిపింది. ఇలాంటి స్థితిలో స్థానిక గురుద్వారాల ద్వారా ఆశ్రయం పొందుతూ బ్రతుకుబండిని కనాకష్టంగా సాగదీస్తున్నారు.
అలా గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ...అద్దె భరించలేననీ, కాలేజీకి వెళ్లేందుకు, బస్ ఛార్జీల కోసం ఇంటిదగ్గరనుంచి, బంధువుల నుంచి డబ్బు తెప్పించుకుని వాడుకుంటున్నానని వాపోయాడు. ఉద్యోగం దొరికితేనే ఏదేని గది అద్దెకు తీసుకోవటం వీలవుతుందనీ, తిరిగీ ఇంటికి వెళ్లిపోతానని అన్నాడు. కానీ అలా వెళ్ళినా బంధువులు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేక అవమానపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
భారత్‌లోని ఏజెంట్లు యూకేలో తప్పకుండా పార్ట్‌టైం జాబ్స్ దొరుకుతాయని నమ్మబలికి ఇక్కడికి పంపించేస్తున్నారనీ, అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని ఇంకో విద్యార్థి ఆరోపించాడు. ఇదిలా ఉంటే..ఆర్థికమాంద్యం, యూకే వచ్చే భారత విద్యార్థుల సంఖ్య పెరగటంతోనే అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications