లండన్: లండన్‌లో భారత సంతతికి చెందిన మహిళ గీతా ఔలాక్స్ దారణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి ఎన్‌ఆర్‌ఐ భర్తతో సహా మరో అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ పేరుగాంచిన ఆసియన్ రేడియో స్టేషన్ సన్‌రైస్ రేడియోలో రిసెప్షనిస్టుగా గీత పనిచేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలను తీసుకువచ్చేందుకు వెళ్లిన గీత ఇక్కడ 'చైల్డ్-మైండర్" నివాసం సమీపంలోని వీధిలో శవమై కనిపించారు. గీత చనిపోయిన నాలుగు గంటల తర్వాత ఓ ప్రయాణికుడు చూసి స్థానిక ఆస్పత్రిలో చేర్పించాడు. స్నేహితులు గీత మంచి వ్యక్తని చెబుతూ, ఆమె భర్త హర్పీత్‌ను విడిచి సంవత్సరం కాలంగా వేరుగా ఉంటోందని తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.