అమెరికాలో సంక్రాంతి సంబరాలు

Nri
కాలిఫోర్నియాలోని బేకర్ ఫీల్డ్ నగరంలో తెలుగువారు సంక్రాంతి పండుగను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చే వాటిలో ముఖ్యమైనవి ముగ్గులు, గొబ్బిళ్ళు, హరిదాసు కీర్తనలు. అమెరికాలో హరిదాసు ఉండడు కాబట్టి, హరిదాసును ముగ్గుగా వేసి ఆ సరదా తీర్చుకున్నారు.

బొమ్మల కొలువుతో ఒక రోజు, విందు భోజనాలు, ఆటలతో మరో రోజు పండుగ జరుపుకున్నారు. పులిహోర, చక్కెర పొంగలి వంటి అచ్చ తెలుగు వంటకాలతో విందు ఆరగించారు. తెలుగు మాటలకు సంబందించి కొన్ని కొత్త ఆటలను కూడా ఆడారు. ఇలాంటి ఆటల వల్ల తమ భాషా పాటవానికి పదును పెట్టినట్టయిందని అనేక మంది భావించారు. భారతీయ పండుగలు అనగానే సినిమా పాటలు పెట్టి పిల్లలతో డ్యాన్స్ చేయించే పద్ధతికి భిన్నంగా పెద్ద వాళ్ళే రకరకాల ఆటలు, పాటలతో ఎంతో సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+