సిలికానాంధ్ర 'మనబడి' ఉత్సవాలు

అనంతరం 'మనబడి' డీన్ చమర్తి రాజు, తూములూరు శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 50కి పైగా కేంద్రాల్లో కొనసాగుతున్న మనబడి కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. దీనికి అందరి ప్రోత్సాహం కావాలని కోరారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రఖ్యా వంశీ, కాత్యాయనులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
క్యూపర్టినోలోని కూచిభొట్ల శాంతి విద్యార్థుల బృందం ఆలపించిన మనబడి గీతాలు.. ఫ్రీమాంట్ నుంచి మాడభూషి జానకి విద్యార్థుల బృందం ప్రదర్శించిన మిత్రలాభం నాటకం, నాగమణి బృందం రసరమ్యగీతాలు ప్రేక్షకులను అలరించాయి. శృంగారం వేణుగోపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆలపించిన సుమతి శతక పద్యాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాజా మాధురి, మహేశ్వరి మద్దాలి, హోత జానకిదేవి, సుసర్లగౌరి శంకర్, తిరుమల పెద్దింటి శ్రీనివాస్, మంగళంపల్లి వసంత, మాలెంపాటి ప్రభ తదితరులు వివిధ అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమ సంచాలకులుగా కాజామాధురి, గుండ్లపల్లి వాణి, నిర్వహకులుగా బుద్ధవరపు వ్యవహరించారు. చివరగా కొండిపర్తి దిలీప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలుగు భోజనాన్ని అందరు ఆరగించారు.












Click it and Unblock the Notifications