కువైత్ లో తెలుగు ఉత్సవాలు
జెద్ధా: కువైత్‌లో తెలుగు కళా సమితి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం 93 మంది బాలబాలికలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా పరమానందయ్య శిష్యులు, హరిదాస్ నారాయణ, స్వాతంత్య్ర పోరాటం నాటకాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తెలుగు కళా సమితి అధ్యక్షులు నళిని మోహన్ మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులు తమ చిన్నారు లకు సంస్కృతి, వారసత్వ కళా సంపద గురించి తెలియజెప్పవలసిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ ఎంబసీ దౌత్యవేత్త విజయ్‌సింగ్ మాట్లా డుతూ, గల్ఫ్ దేశాలలోని తెలుగు ప్రజలు తమ సంస్కృతి పట్ల చూపుతున్న ఆదరణను ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఫ్యాన్సీ షోలను కూడా నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.












Click it and Unblock the Notifications