సిడ్నీలో తెలంగాణ అమరవీరులకు నివాళి

ఎటిఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ తెలంగాణ సాయుధ పోరాటంపై సంక్షిప్తంగా ప్రసంగించారు. ప్రధాన కార్యదర్శి పాపిరెడ్ిడ ఎటిఎఫ్ స్థాపనపై నివేదికను సమర్పించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ హేమచందర్ రావు ఎటిఎఫ్ నూతన కమిటీని అభినందించారు. తెలంగాణ మేధావి ఘంటా చక్రపాణి, న్యాయవాది రామచంద్రరావు నుంచి టెలీ కాన్ఫరెన్స్ సందేశం తీసుకున్నారు. సిడ్నీ పర్యనటలోే ఉన్న బ్రహ్మారావు, భూపాల్ రెడ్డి అతిథి ప్రసంగాలు చేశారు.
ఎటిఎఫ్ సలహాదారు డాక్టర్ వినోద్ ఏలేటి తెలంగాణ విమోచనోద్యమం క్లిప్పింగ్స్ ను ప్రదర్శించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వినోద్, సాగర్, సోమేశ్వర్ రెడ్డి, మాధవ్, రాజశేఖర్, రవికాంత్, ఇంద్రసేన్, నర్సింగరావు, జయపాల్, నరేష్, ప్రమోద్, ఉపేందర్, దేవేందర్, అశోక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications