భారత విద్యార్థులపై ఆస్ట్రేలియా నిబంధనలు

Australia
ఆస్ట్రేలియాలో స్థిరపడాలనుకునే విదేశీయులకు నిబంధనలు కఠినతరం చేస్తూ ఆ దేశం కొత్త వలసల విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం అభ్యర్థికి ఆంగ్ల భాషలో గల ప్రావీణ్యం, ఉన్నత స్థాయి విద్యార్హతలు, వృత్తివిద్యా నైపుణ్యాలు, అనుభవం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. దీనికి సంబంధించి నూతన పాయింట్ల ఆధారిత వలసల ప్రమాణాలను గురువారం ఆస్ట్రేలియా వలసల వ్యవహారాల మంత్రి క్రిస్‌ బోవెన్‌ వెల్లడించారు. నూతన విధానంతో ఏదో ఒక అంశం ద్వారా విదేశీయులు ఆస్ట్రేలియా ప్రవాసాన్ని పొందలేరని ఆయన స్పష్టం చేశారు.

గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రకటించిన నైపుణ్య వలసల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సంస్కరణలను అనుసరించి పాయింట్ల పరీక్షల్లో మార్పులు చేపట్టినట్టు బొవెన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా ఆర్థికరంగ అవసరాలు, దేశ మధ్య, దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఈ సంస్కరణలు అమలు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆస్ట్రేలియా తాజా విధానం తక్కువస్థాయి నైపుణ్యాలు కలిగి ఆస్ట్రేలియా ప్రవాసాన్ని కోరుతున్న భారతీయ విద్యార్థులకు ఇబ్బంది కలిగించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+